జగిత్యాలలో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వెదురు కర్రల షాప్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తూండగానే పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపుచేయడంతో ముప్పు తప్పింది. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీయగా.. వంట చేస్తుండగా మంటలు ఎగిశాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అప్రమత్తతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. మరోవైపు ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామానంతా బుగ్గిపాలైందని వాపోయారు బాధిత కుటుంబసభ్యులు. లక్షల్లో […]

జగిత్యాలలో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 8:47 AM

జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వెదురు కర్రల షాప్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తూండగానే పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపుచేయడంతో ముప్పు తప్పింది.

ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీయగా.. వంట చేస్తుండగా మంటలు ఎగిశాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అప్రమత్తతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. మరోవైపు ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామానంతా బుగ్గిపాలైందని వాపోయారు బాధిత కుటుంబసభ్యులు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందన్నారు.

Latest Articles