AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: అటువైపు వైసీపీ గర్జన.. ఇటు సేనాని రోడ్ షో.. ఏది సక్సెస్ అవుతుందో..

అమరావతి రాజధాని అంటూ నిన్న మెున్నటి వరకు విజయవాడ-గుంటూరు కేంద్రంగా నడిచిన రాజకీయం ఇప్పుడు విశాఖకు షిఫ్ట్ అయింది. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ నుంచే ఉద్యమ కార్యచరణ మొదలవుతోంది. అటు జనసేనాని రోడ్ షో కూడా ఉంది.

Vizag: అటువైపు వైసీపీ గర్జన.. ఇటు సేనాని రోడ్ షో.. ఏది సక్సెస్ అవుతుందో..
Pawan Kalyan Road Show
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2022 | 10:21 AM

Share

జనసేన కూడా నేడు విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని చేపట్దింది. ఇటు టీడీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించేందుకు ప్లానే రెడీ చేశారు. విశాఖ గర్జన సమయంలోనే పవన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. గర్జన ఎందుకు అంటూ అధికార వైసీపీకి 20కి పైగా ప్రశ్నలు సంధించారు. జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వచ్చే వినతులను పవన్ కల్యాణ్ నేరుగా స్వీకరిస్తారు. 17న ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు జనసేనాని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.

విశాఖ గర్జనను విజయవంతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ.. మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని పార్టీ ప్రముఖులతో పాటు మేధావులను కూడా విశాఖకు ఆహ్వానించింది. ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఏం చేయలేదని… అలాగే గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు… ప్రస్తుతం చెబుతున్న మాటలను వివరించాలని ప్లాన్ చేస్తోంది.

ఏపీ రాజధానిపై పార్టీల మధ్య యుద్ధం ఆగడం లేదు.. వికేంద్రీకరణే ముద్దని అధికారపార్టీ అంటుంటే.. ఒకే రాజధాని అంటూ విపక్షాలు అంటున్నాయి..క్యాపిటల్‌ విషయంలో ఎవరి వెర్షన్‌ వారు చెబుతున్నారు.  అటు విశాఖ గర్జన, ఇటు టీడీపీ నేతల రౌండ్‌టేబుల్‌ , మరోవైపు జనసేన పార్టీ అధినేత రోడ్ షో… మూడు పార్టీలు తీరంలోకి ఎంటరవ్వడంతో ఉక్కు నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..