Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై తగ్గేదేలే.. ఏపీలోనూ బీఆర్ఎస్, బీజేపీల పొలిటికల్‌ వార్‌

|

Apr 15, 2023 | 7:35 AM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటంలో బీఆర్ఎస్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇటీవల బీఆర్ఎస్ ఏపీ చీఫ్‌ తోట చంద్రశేఖర్ విశాఖ వెళ్లి.. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపారు. ఆ క్రమంలో.. స్టీల్ ప్లాంట్‌ జంక్షన్‌లో భారీగా ఫ్లెక్సీలు, జెండాలు కట్టారు. అయితే.. బీజేపీ ఎంపీ జీవీఎల్ విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ పర్యటన..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై తగ్గేదేలే.. ఏపీలోనూ బీఆర్ఎస్, బీజేపీల పొలిటికల్‌ వార్‌
Vizag Steel Plant
Follow us on

బీజేపీ, బీఆర్ఎస్ పొలిటికల్‌ ఫైట్‌ తెలంగాణ నుంచి ఆంధ్రాకు చేరింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా రెండు పార్టీల మధ్య ఏపీలోనూ పోరు సాగుతోంది. జెండాలు పీకడం.. ఆపై కేసుల వరకూ వెళ్లడంతో విశాఖ పాలిటిక్స్‌లో హీట్‌ పెరుగుతోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటంలో బీఆర్ఎస్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇటీవల బీఆర్ఎస్ ఏపీ చీఫ్‌ తోట చంద్రశేఖర్ విశాఖ వెళ్లి.. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపారు. ఆ క్రమంలో.. స్టీల్ ప్లాంట్‌ జంక్షన్‌లో భారీగా ఫ్లెక్సీలు, జెండాలు కట్టారు. అయితే.. బీజేపీ ఎంపీ జీవీఎల్ విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ పర్యటన సందర్భంలో ఏపీ బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ జెండాలను పీకేయడం వివాదాస్పదంగా మారింది. అదేసమయంలో.. ఆంధ్రప్రదేశ్‌ విషయాల్లో కేసీఆర్‌ కల్పించుకోవడం కేవలం రాజకీయ కోణమేనని ఆరోపించారు జీవీఎల్‌. ఇక.. బీజేపీ శ్రేణులు.. బీఆర్ఎస్‌ జెండాలు పీకేయడంపై ఏపీలోని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ పీకేసిన జెండాలను మళ్లీ యథావిధిగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ ఎంట్రీతోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు ఏపీ బీఆర్ఎస్ నేత గాదె బాలాజీ.

 

ఇదిలావుంటే.. బీజేపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. జీవీఎల్‌తోపాటు జెండాలు పీకిన కమలం పార్టీ నేతలపై దువ్వాడ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీవీఎల్ ప్రోత్సాహంతోనే బీజేపీ శ్రేణులు.. బీఆర్ఎస్ జెండాలు పీకేశాయని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఫిర్యాదు తీసుకున్న దువ్వాడ సీఐ శ్రీనివాస్.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా.. తెలంగాణలోని బీఆర్ఎస్‌-బీజేపీ వార్‌ ఏపీలోనూ షురూ అయింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..