AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వాకపల్లి ఆదివాసీ మహిళల రేప్‌ కేసులో సంచలన తీర్పు.. నేరం రుజువు కాలేదంటూ..

నక్సల్స్ ఉన్నారన్న సమాచారం తో కుంబింగ్ కోసం వెళ్లిన 21 మంది గ్రేహౌండ్స్ పోలీసు బృందం అత్యాచారాలకు పాల్పద్దారని కేసు నమోదు అయింది. మానవహక్కులు,పౌర సంఘాలు, గిరిజన సంఘాలు కల్పించుకోవడంతో సుప్రీం కోర్టు దాకా కేసు వెళ్ళింది. 2007నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసు..

Andhra Pradesh: వాకపల్లి ఆదివాసీ మహిళల రేప్‌ కేసులో సంచలన తీర్పు.. నేరం రుజువు కాలేదంటూ..
Vakapalli Gang Rape Case
Basha Shek
|

Updated on: Apr 07, 2023 | 6:20 AM

Share

సంచలనం సృష్టించిన వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును విశాఖ ఎస్ సీ/ఎస్టీ కోర్టు కొట్టేసింది. 2007 ఆగస్టు 20 న జి.మాడుగుల మండలం వాకపల్లిలో 21 మంది పోలీసులు 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం చేశారని అభియోగం నమోదైంది. నక్సల్స్ ఉన్నారన్న సమాచారం తో కుంబింగ్ కోసం వెళ్లిన 21 మంది గ్రేహౌండ్స్ పోలీసు బృందం అత్యాచారాలకు పాల్పద్దారని కేసు నమోదు అయింది. మానవహక్కులు,పౌర సంఘాలు, గిరిజన సంఘాలు కల్పించుకోవడంతో సుప్రీం కోర్టు దాకా కేసు వెళ్ళింది. 2007నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాలతో 2018 నుంచి విశాఖ ఎస్ సీ, ఎస్టీ కేసు ఈ విచారణ చేపట్టింది. కేసు విచారణ దశలోనే ఇద్దరు మహిళలు మృతి చెందగా తాజాగా విచారణలో నేరం రుజువు కాలేదని, కేసు కొట్టేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే కోర్టు అప్పటి దర్యాప్తు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు న్యాయవాదులు తెలిపారు. అలాగే రిటైర్డ్‌ ఏసీపీ శివానందరెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలిపింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లీగల్ సెల్ అథారిటీని కోర్టు ఆదేశించినట్టు వివరించారు.

మరొకవైపు వాకపల్లి ఘటన పై న్యాయపోరాటం చేసిన మహిళా చేతన నేత కత్తి పద్మ టీవీ9 తో మాట్లాడారు. వాకపల్లి అత్యాచార ఘటన లో అత్యాచారం జరిగిందని కోర్టు ప్రాథమికంగా నమ్మినా సాక్ష్యాలు సరిగా లేని కారణంగా కేసు కొట్టేసినట్టు కోర్టు చెప్పడం మా విజయమే అన్నారు. అప్పటి ఐవో ఆనంద రావు నిందితుల గుర్తింపు పరేడ్ ను నిర్వహించకపోవడంపై కోర్టు తప్పు పట్టిందనీ, ఆనంద్ రావ్ మరణించకపోతే చర్యలు తీసుకునేవాళ్ళమని కోర్టు తీర్పు లో వివరించిందనీ ఆమె తెలిపారు. ఆ తర్వాత వచ్చిన రిటైర్డ్ ఏసీపీ శివానంద రెడ్డి పై చర్యలు తీసుకోమని కోర్టు ఆదేశించిందనీ, అత్యాచారం జరిగిందని కోర్టు నమ్మింది కాబట్టే ఆ మహిళలను బాధితులుగా గుర్తించి ఆర్ధిక సహాయం చేయమని లీగల్ సర్వీస్ అథారిటీ కి సూచించినట్టు కత్తి పద్మ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.