Vizag Steel Plant: ఉక్కు సంకల్పానికి 1000 రోజులు.. కష్టం మొత్తం కార్మికులదే

బిగిసిన ఉక్కు పిడికిలి బిగించినట్టే ఉంది. కానీ.. ఆ ఉక్కు సంకల్పం మాత్రం నెరవేరిన దాఖలాలు కనపడటం లేదు. నెరవేరుతుందన్న ఆశలు కూడా కొద్దికొద్దిగా ఆవిరి అవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదలైన పోరాటానికి ఇవాళ్టికి సరిగ్గా వెయ్యి రోజులు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ షురూ అయిన మలి దశ ఉద్యమం.. ఇవాళ్టిదాకా ఉడుకెత్తుతూనే ఉంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కోసం మొదలైన పోరాటం వెయ్యిరోజులకు చేరింది. కేంద్ర ప్రభుత్వం

Vizag Steel Plant: ఉక్కు సంకల్పానికి 1000 రోజులు.. కష్టం మొత్తం కార్మికులదే
1000 Days Of Protest Against Privatization Of Visakha Steel Plant Has Been Completed

Updated on: Nov 08, 2023 | 6:18 PM

బిగిసిన ఉక్కు పిడికిలి బిగించినట్టే ఉంది. కానీ.. ఆ ఉక్కు సంకల్పం మాత్రం నెరవేరిన దాఖలాలు కనపడటం లేదు. నెరవేరుతుందన్న ఆశలు కూడా కొద్దికొద్దిగా ఆవిరి అవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదలైన పోరాటానికి ఇవాళ్టికి సరిగ్గా వెయ్యి రోజులు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ షురూ అయిన మలి దశ ఉద్యమం.. ఇవాళ్టిదాకా ఉడుకెత్తుతూనే ఉంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కోసం మొదలైన పోరాటం వెయ్యిరోజులకు చేరింది. కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా తగ్గేదే లేదంటోంది ఉమ్మడి పోరాట కమిటీ. ఇవాళ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనం రోడ్డెక్కారు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. వెయ్యిరోజులైనా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు, అదరలేదు, బెదర లేదు. రాజకీయ పార్టీలు హ్యాండ్ ఇచ్చినా, అడ్వైజర్లను నియమిస్తామంటూ యాజమాన్యం కంటితుడుపు మాటలతో సరిపెట్టినా.. కార్మికులు మాత్రం పోరాటాన్ని ముందుకే నడిపారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకోడానికే సిద్ధపడ్డారు. ఈ వెయ్యిరోజుల ఉద్యమంలో ఎన్నో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి.

2021 జనవరి 27, న.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. స్టీల్‌ ప్లాంట్‌లో నూరు శాతం వ్యూహాత్మక విక్రయాన్ని ప్రకటించడంతో కలకలం మొదలైంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు CITU, AITUC, INTUC కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ VUPPC ఏర్పాటు చేసుకున్నాయి. 2021 నవంబర్‌లో వాల్యుయేషన్ కోసం రెండు కమిటీల్ని ఏర్పాటు చేసింది కేంద్రప్రభుత్వం. కమిటీ సభ్యులను హెలికాప్టర్‌లో ప్లాంట్‌లోకి తీసుకెళ్లారు. కానీ.. ఉద్యోగులు గుమిగూడి ప్రతిఘటించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

వాల్యుయేషన్ నివేదిక సిద్ధంగా లేదు గనుక.. బిడ్డింగ్‌కు అవకాశం లేకుండా చేయడంలో విజయం సాధించారు ప్లాంట్ కార్మికులు. ఉద్యోగులు, ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఎన్నికల ర్యాలీలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. కానీ.. అది మాట వరకే ఆగిపోయింది. ప్రభుత్వ పరంగా నిర్ణయం వెలువడలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా, అది ఆమోదానికి నోచుకోలేదు. మిగతా ప్రజాప్రతినిధులెవరూ రాజీనామాల ఊసే ఎత్తలేదు. కార్మిక సంఘాల జేఏసీ నేతలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని సీఎం జగన్‌ను కోరితే, హామీ దొరికింది తప్ప.. సదరు హామీ ఆచరణలోకి రాలేదు.

ఇవి కూడా చదవండి

క్యాప్టివ్ ఐరన్ మైన్స్‌ కేటాయించని ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్. ఒక టన్ను ఇనుప ఖనిజం 900 రూపాయలైతే.. విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేట్ మార్కెట్ నుండి గరిష్టంగా 5 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి కావల్సిన ఐరన్ మైన్స్‌ని కేటాయిస్తే.. ప్రైవేటీకరణ జోలికే వెళ్లాల్సిన అవసరం రాదంటున్నారు నిరసనకారులు. ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే. ఆ మేరకు పోరాట కమిటీకి మద్దతునిస్తున్నాయి కూడా. కాకపోతే.. అది నామమాత్రమేనని, కార్యాచరణలో కలిసి రావడం లేదని ఆరోపణలున్నారు కొందరు నిపుణులు. రాజకీయాలకు అతీతంగా కలిసి నడిస్తేనే పోరాటానికి ఫలితం ఉంటుంది. లేకపోతే.. మరో వెయ్యిరోజులు గడిచినా.. ఉక్కు సంకల్పం నెరవేరే ఛాన్సుల్లేవు అంటున్నారు పరిశీలకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..