పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో జర్రుంటే..
విశాఖపట్నంలోని అగనంపూడిలో నిద్రించేందుకు సిద్ధమైన ఓ యువకుడికి దోమతెరలో ఆరడుగుల నాగుపాము కనిపించి షాక్‌కు గురయ్యాడు. కాలికి మెత్తగా తగలడంతో లోపల చూడగా పాము కనిపించింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ అర్ధరాత్రి అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా రెస్క్యూ చేశాడు. అదృష్టవశాత్తూ యువకుడిని పాము కాటు వేయలేదు.

విశాఖలోని అగనంపూడి ప్రాంతం.. రోజంతా కూలి పనులకు వెళ్లిన బ్యాచిలర్స్ చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఫ్రెష్ అప్ అయ్యాక.. పడుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ యువకుడు అప్పటికే సిద్ధం చేసుకున్న.. దోమతెర వైపు కదిలాడు. ఆ దోమ తెర లేపి లోపలికి వెళ్లే క్రమంలో కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. దోమతెర లోపల కదులుతున్నట్టు అనిపించింది. చూసేసరికి.. గుండె పట్టుకునేంత పనయ్యింది.
రోజు మాదిరిగానే కొంతమంది యువకులు కూలీ పని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఆ ఇంట్లో నలుగురు యువకులు నివాసం ఉంటున్నారు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాక భోజనం చేశారు. ఓ గదిలో వేరువేరుగా నేలపైనే బెడ్స్ వేసుకున్నారు. అందులో ఓ యువకుడు మాత్రం దోమల బెడద తాగలేక.. దోమతెర సిద్ధం చేసుకున్నాడు. రోజు మాదిరిగానే.. పడుకోవడానికి వెళ్ళాడు. దోమతెర వద్దకు వెళ్లి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. చేతితో పైకి లేపే క్రమంలో.. కాలితో కిందనున్న వల భాగాన్ని ముట్టాడు. ఏదో మెత్తగా తగిలినట్టు అనిపించింది. ఒక్కసారిగా కదిలింది. చూసేసరికి.. గుండె పట్టుకున్నాడు ఆ యువకుడు. అందులో ఉన్నది ఏంటో తెలుసా ఆరడుగుల పాము.. వెంటనే బయటకు పరుగులు తీశారు..
వీడియో చూడండి..
ఆ తరువాత స్నేక్ కేచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అక్కడకు చేరుకున్న కిరణ్ కుమార్.. నాగు పాముగా గుర్తించి రెస్క్యూ చేసాడు. దీంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. అదృష్టవశాత్తు దోమతెరపై కాలు వేసిన యువకుడికి పాము కాటు వేయలేదు. లేకుంటే ప్రాణమే పోయేదని కిరణ్ కుమార్ అంటూ.. భయంతో చెప్పాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
