ఆస్తులున్నా మొదటి అంతస్తు నిర్మించని గ్రామం.. అసలు కారణం ఇదే..

|

Mar 04, 2024 | 7:18 PM

నేటి సమాజంలో ఎటు చూసినా ఎత్తైన భవంతులే దర్శనమిస్తున్నాయి. అడుగు జాగా కనిపిస్తే అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నారు బిల్డర్లు. ఇదిలా ఉంటే ఈ గ్రామంలో మాత్రం మొదటి అంతస్తును మించి భవనాలు నిర్మించరు స్థానికులు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పడు ఉన్న తరంలో సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఇప్పటికే ఇల్లు ఉన్న వారు పైన మరో అంతస్తు వేద్దామని తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఆస్తులున్నా మొదటి అంతస్తు నిర్మించని గ్రామం.. అసలు కారణం ఇదే..
Villegers In Prakasham Dist
Follow us on

నేటి సమాజంలో ఎటు చూసినా ఎత్తైన భవంతులే దర్శనమిస్తున్నాయి. అడుగు జాగా కనిపిస్తే అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నారు బిల్డర్లు. ఇదిలా ఉంటే ఈ గ్రామంలో మాత్రం మొదటి అంతస్తును మించి భవనాలు నిర్మించరు స్థానికులు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పడు ఉన్న తరంలో సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఇప్పటికే ఇల్లు ఉన్న వారు పైన మరో అంతస్తు వేద్దామని తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అయితే ఈ ప్రాంతంలోని వాసులకు ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ పై అంతస్తు నిర్మించడానికి సుముఖంగా లేరు.

ఈమధ్య కాలంలో చిన్న గ్రామం, పెద్ద పట్టణం అన్న తేడా లేదు. ఎక్కడైనా సరే పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన పాతసింగరకొండ గ్రామంలో మాత్రం ఇంటిపై మరో మొదటి అంతస్తు వేసుకునేందుకు ముందుకు రావడంలేదు. సుమారు 700 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రతి ఏటా పెరుగుతున్నా అందులోనే సర్థుకు పోతారు తప్ప పైన మరో అంతస్తు వేసుకుందాం అనుకోరు. అవసరమైతే మరో ఇంటినైనా నిర్మించుకుంటారు కానీ మొదటి అంతస్తు మాత్రం వేసుకోరు. ఇది ప్రభుత్వాలు, పాలకులు ఏర్పాటు చేసిన ఆదేశాలు కావు. గ్రామస్థులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. తరతరాల నుంచి వస్తున్న ఆచారం అని చెబుతున్నారు నివాసితులు.

దీనికి కారణం ఆ ఊరిలో ఉన్న లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం అట. ఈ గుళ్లోని దేవుడిని దర్శించుకుని మనస్పూర్తిగా వేడుకుంటే ఎలాంటి కష్టం రానివ్వకుండా కంటికి రెప్పోలే కాపాడుతారని ప్రజల విశ్వాసం. అందుకే ఆలయానికి మించి తమ ఇల్లు ఎత్తులో ఉండకూడదని సంకల్పించుకున్నారు. దీనికి తోడూ ఊరిలోని ప్రజలకు మంచి జరగడంతో నమ్మకం మరింత బలపడింది. ఇళ్లైనా.. ప్రభుత్వ కార్యాలయాలైనా గ్రౌండ్ ఫ్లోర్ తో ఆగిపోవాల్సిందే. మొదటి అంతస్తు వేసేందుకు గ్రామస్తులు ఒప్పుకోరు. ఒకవేళ ఈ నమ్మకానికి వ్యతిరేకంగా వెళితే ఇళ్లు నిర్మించే కుటుంబంలోని సభ్యలు అకాలంగా మరణిస్తారని చెబుతున్నారు స్థానికులు. దీంతో పై అంతస్తు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్రత్యేకతను సంతరించుకుంది ఈ గ్రామం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..