IRCTC: షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఎలాంటి రిస్క్‌ లేకుండా ఇలా వెళ్లండి..

షిరిడీ సాయి నాథుడిని దర్శించుకోవాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ మంచి అవకాశాన్ని కల్పించింది. విజయవాడ్‌ నుంచి షిరిడీకి ఓ టూర్ ప్లాన్‌ను ఆపరేట్ చేస్తున్నారు. సాయి సన్నిధి ఎక్స్‌ విజయవాడ పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. ప్రతీ మంగళవారం ఈ టూర్‌ ఉంటుంది. ఇంతకీ ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు...

IRCTC: షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఎలాంటి రిస్క్‌ లేకుండా ఇలా వెళ్లండి..
Irctc Shirdi Tour
Follow us

|

Updated on: Mar 04, 2024 | 6:03 PM

షిరిడీ సాయి నాథుడిని దర్శించుకోవాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ మంచి అవకాశాన్ని కల్పించింది. విజయవాడ్‌ నుంచి షిరిడీకి ఓ టూర్ ప్లాన్‌ను ఆపరేట్ చేస్తున్నారు. సాయి సన్నిధి ఎక్స్‌ విజయవాడ పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. ప్రతీ మంగళవారం ఈ టూర్‌ ఉంటుంది. ఇంతకీ ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* తొలి రోజు మంగళవారం విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 10.15 గంటలకు ట్రైన్‌ నెంబర్‌ 17208 రైలు బయలు దేరుతుంది. సాయినగర్ షిరిడి ఎక్స్‌ ప్రెస్‌ రైలులో రాత్రంతా జర్నీ ఉంటుంది.

* రెండో రోజు (బుధవారం) ఉదయం 6.15 గంటలకు షిరిడీకి సమీపంలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌ వరకు తీసుకెళ్తారు. అనంతరం ఫ్రెషప్‌ అయిన తర్వాత దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆరోజు రాత్రి మొత్తం షిరిడీలోనే గడుపుతారు.

* ఇక మూడో రోజు (గురువారం) ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ అనంతరం హోటల్‌ నుంచి చెకవుట్‌ అవుతారు. ఆసక్తి ఉన్న వారు మరోసారి సాయి దర్శనం చేసుకోవచ్చు. అనంతరం షిరడీ నుంచి శనిశంగ్నాపూర్‌ వెళ్తారు. అనంతరం అక్కడ దర్శనం పూర్తి చేసుకుని నాగర్‌సోల్‌ రైల్వే స్టేషన్‌ను చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకకు ట్రైన్‌ నెంబర్‌ 17205 రైలులో తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

* నాల్గవ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుకుంటారు. దీంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

కంఫర్ట్‌ (3ఏ)లో సింగిల్‌ ఆక్యూపెన్సీకి రూ. 14,930, డబుల్‌ ఆక్యూపెన్సీకి రూ. 9430, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ. 8030, చైల్డ్‌ విత్‌ బెడ్‌ అయితే రూ. 7320, చైల్డ్‌ వితవుట్‌ బెడ్‌ రూ. 6330గా నిర్ణయించారు. స్లీపర్‌ విషయానికొస్తే సింగిల్‌ ఆక్యూపెన్సీకి రూ. 12,470, డబుల్‌ ఆక్యూపెన్సీకి రూ. 6970, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ. 5570, చైల్డ్‌ విత్‌ బెడ్‌ రూ. 4860, చైల్డ్‌ వితవుట్‌ రూ. 3870 గా నిర్ణయించారు.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు