AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధుడి అకౌంట్ నుంచి 10 కోట్లు బదిలీ.. ఎందుకు అని అడిగితే పల్లీ బఠాణీతో సమానం అన్నాడు.. కట్ చేస్తే..

సైబర్ మాఫియా మెయిన్ టార్గెట్‌ సీనియర్లు సిటిజన్లు. రిటైర్డ్ ఉద్యోగులు. సో.. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండండి. డిజిటల్ అరెస్ట్‌లు అనేవి ఉండవు. ఇదే విషయంలో కేంద్రం.. ప్రతీ ఫోన్‌కి కాలర్ ట్యూన్‌గా పెట్టింది. టీవీల్లో, సోషల్ మీడియాల్లో యాడ్స్ కూడా ఇస్తోంది. అయినా నిర్లక్ష్యంగా ఉంటే కనీసం పల్లీ బఠాణీకి కూడా ఖర్చు చేయకుండానే డబ్బంతా గాయబ్ అయిపోతుంది. బీ అలర్ట్‌..!

వృద్ధుడి అకౌంట్ నుంచి 10 కోట్లు బదిలీ.. ఎందుకు అని అడిగితే పల్లీ బఠాణీతో సమానం అన్నాడు.. కట్ చేస్తే..
Vijayawada
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2026 | 4:54 PM

Share

డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు మొర్రో అని సెల్‌ఫోన్‌లో కాలర్ టోన్ మోగుతూ ఉన్నా, అనుమానం ఉంటే పోలీసులకు ఫోన్ చేయాలని చెబుతున్నా కొందరిలో మాత్రం అవగాహన రావడంలేదు. పైగా పరువుకు భయపడిచస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా విజయవాడలో జరిగింది. ఆ కేసు కూపీలాగే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి. విజయవాడ పటమటకు చెందిన 81ఏళ్ల వృద్ధున్ని సెప్టెంబర్ 18న గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. CBI అధికారులం అంటూ, ముంబై నుంచి కాల్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఆ వృద్ధుడి బ్యాంక్ అకౌంట్ ఖాతాకీ ఉగ్రవాదులకీ లింక్ ఉందని చెప్పి బెంబేలెత్తించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ డాక్యుమెంట్లు, డేటా తీసుకున్నారు. దాదాపు వారం పదిరోజులు రోజూ కాల్‌ చేస్తూ ఇలాగే టెన్షన్ పెడుతూ వచ్చారు సైబర్ క్రిమినల్స్‌. అరెస్ట్ ఆపాలంటే డబ్బు పంపాలంటూ పదికోట్లకు టెండర్ వేశారు. ఆ వృద్ధుడు ఇదంతా చూసి భయపడిపోయాడు. వాళ్లు చెప్పిన రెండు అకౌంట్‌ నెంబర్లకు డబ్బు పంపేందుకు సిద్ధమయ్యాడు. మొదట విడతగా సెప్టెంబర్ 22న 3 కోట్లు పంపాడు. అతని భయాన్ని మరింత క్యాష్ చేసుకోవాలనుకున్న సైబర్ మాఫియా మరింత భయపెట్టింది. దశలవారీగా మొత్తం పదికోట్లు గుంజేసింది.

విచిత్రం ఏంటంటే.. FDలని బ్రేక్‌ చేసి మరీ ఈ మొత్తం ట్రాన్స్‌జాక్షన్స్‌ చేశాడు ఆ వృద్ధుడు. అక్కడే బ్యాంక్ అధికారులకు డౌట్ వచ్చింది. అతన్ని పిలిపించి ఎందుకు, ఎవరికి అంటూ ఆరా తీశారు. పరువు కోసం భయపడిన ఆ వృద్ధుడు నిజం చెప్పకపోగా.. పది కోట్లు నాకు పల్లీ బఠాణీతో సమానం.. చెప్పింది చెయ్యండని భీష్మించాడు. అయితే తండ్రి ప్రవర్తనలో తేడా, ఖాతాలో ఖాళీ అవుతున్న డబ్బును చూసి అతని కుమారుడు ఆరా తీశాడు. అప్పడు కూడా నిజం చెప్పకపోగా.. నా కష్టార్జితం అంటూ రివర్స్ అయ్యాడతను. ఇక లాభం లేదు.. అంతా తేడాగా ఉందని ఆ కొడుకే కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అనుమానాస్పద లావాదేవీల కింద పోలీసులు వృద్ధుడి మీద కూడా కేసు పెడతామని వార్నింగ్ ఇవ్వడంతో డిజిటల్ అరెస్ట్ వ్యవహారాన్ని కక్కేశాడు. అప్పటికప్పుడు యాక్షన్‌లోకి దిగిన సైబర్‌ క్రైమ్ పోలీసులు బదిలీ అయిన ఒక అకౌంట్‌ నుంచి 7కోట్లను ఫ్రీజ్ చేశారు. మరో అకౌంట్‌కి చేరిన 3 కోట్లు మాత్రం అప్పటికే 264 అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. వాటి KYC కూడా చూసి తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us