Watch Video: పిఠాపురంలో ఎర్ర కండువా రాజకీయం..వంగా గీత వర్సెస్ నాగబాబు

| Edited By: Srikar T

May 14, 2024 | 5:01 PM

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎర్ర కండువాపై పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. జన సైనికులు పోలింగ్ కేంద్రాల్లో ఎర్ర కండువాను వేసుకోవడంపై వంగా గీత ఫైర్ అయ్యారు. దీనిపై జనసేన నాయకుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Watch Video: పిఠాపురంలో ఎర్ర కండువా రాజకీయం..వంగా గీత వర్సెస్ నాగబాబు
Pitapuram Politics
Follow us on

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎర్ర కండువాపై పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. జన సైనికులు పోలింగ్ కేంద్రాల్లో ఎర్ర కండువాను వేసుకోవడంపై వంగా గీత ఫైర్ అయ్యారు. దీనిపై జనసేన నాయకుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ ఎంపీ ప్రస్తుత పిఠాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఎన్నికల బూత్‎లోకి జనసేన ఏజెంట్లు ఎర్రకండువా వేసుకు రావడంపై ఫైర్ అయ్యారు. జనసేనకు చెందిన కార్యకర్తలు ఎర్ర కండువా వేసుకుని బూత్‎లోకి వచ్చి ప్రచారం చేయడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎర్రకాండువాను తక్షణం తీసేయాలంటూ డిమాండ్ చేసి జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఎర్ర టవలు వేసుకుని గాజు గ్లాసుకి ఓటేయాలంటూ మీరు ఎలా చెప్తారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు వంగా గీత. తాము కూడా వైసీపీ కండువాలు వేసుకుని తిరుగుతాం అని చెప్పారు. ఈ క్రమంలోనే జనసేన అబ్జర్వర్ ఎర్ర కండువా వేసుకున్న విషయాన్ని ఎన్నికల అధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు.

అయితే దీనిపై జనసేన నాయకుడు నాగబాబు స్పందించారు. ఎన్నికల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దీనిపై వంగ గీతకు సమాధానం ఇచ్చారు. ఎర్ర కండువా అనేది జనసేన జెండా కాదు. పవన్ కళ్యాణ్ ఎర్ర కండువా వేసుకుంటున్నారు కాబట్టి దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్ర కండువాని కాశీ తువాలంటారని అది మా చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నాం అన్నారు. సామాన్య మానవుడు చెమట తుడుచుకునేందుకు ఉపయోగించే ఒక సాధారణ తువాల్ గురించి వంగ గీత తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..