Vande Bharat: ఏపీకి వందేభారత్ స్లీపర్ రైలు.. ఆ రూట్లోనే ఫిక్స్..?
నరసాపురం రైల్వేస్టేషన్‌లోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్.. కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఆయన.. వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కే ముందుగా ట్రాక్ సామర్ధ్యాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు చెప్పారు. అలాగే నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ప్యాసింజర్‌ను..

నరసాపురం, అక్టోబర్ 14: ఏపీ రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ అందించనుంది రైల్వేశాఖ. రాష్ట్రానికి వందేభారత్ స్లీపర్ రైలును కేటాయించినట్టు తెలుస్తోంది. నరసాపురం-బెంగళూరు మధ్య ఈ వందేభారత్ స్లీపర్ రైలు నడిస్తుందని సమాచారం. ఇది పట్టాలెక్కగానే ఈ రెండు రూట్ల మధ్య ప్రయాణ భారం 10 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. వందేభారత్ స్లీపర్ రైలును ట్రాక్ సామర్ధ్యం బట్టి గుంటూరు లేదా ఒంగోలు మీదుగా నడపాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇటీవల నరసాపురం రైల్వేస్టేషన్‌లోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్.. కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఆయన.. వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కే ముందుగా ట్రాక్ సామర్ధ్యాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు చెప్పారు. అలాగే నరసాపురం – గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్‌ను తిరిగి పునరుద్దరిస్తామని విజయవాడ డీఆర్ఎం చెప్పారు. అటు గతంలో నడిచిన నరసాపురం -విశాఖపట్నం లింకు ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి సమయంలో నడిచే ప్రతిపాదన కూడా ఉందన్నారు. బెంగళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఇకపై రెగ్యులర్ చేసే ఆలోచన ఉందని.. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను సైతం నరసాపురం వరకు పొడిగించేందుకు ఆమోదం వచ్చిందన్నారు.
మరోవైపు వందేభారత్ స్లీపర్ రైళ్లను అత్యాధునిక డిజైన్లతో రూపొందిస్తోంది కేంద్ర రైల్వేశాఖ. ప్రతీ రైలులోనూ 857 బెర్తులు ఉండనున్నాయి. ఇక కోచ్‌కు వచ్చి మూడు టాయిలెట్లు, ఒక మినీ ప్యాంట్రీ ఉంటాయి. అలాగే దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ర్యాంప్‌లను సైతం ఏర్పాటు చేయనుంది రైల్వే శాఖ. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లు 2024 మార్చికల్లా పట్టాలెక్కనున్నాయి. కాగా, ఇప్పటికే ఏపీలో నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం కాగా, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి, ఇంకోటి విజయవాడ-చెన్నై, మరొకటి కాచిగూడ-యశ్వంత్‌పూర్ రూట్లలో పరుగులు పెడుతున్నాయి. ఇక ఈ నాలుగు రైళ్లకు ఎక్కువ ప్రజాదరణ ఉంది.
వందేభారత్ స్లీపర్ కోచ్ ఇలా..
The first version of the Vande Bharat sleeper train with 857 berths to roll-out by March 2024.
Trains will facilitate long distance travel to passengers on these high-speed trains overnight🔥 So much improvements on Indian 🇮🇳 rail. pic.twitter.com/6oHMLKrew3
— Erik Solheim (@ErikSolheim) October 6, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..