AP Rains: ఆంధ్రాలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
మాడు పగిలే ఎండలో గుడ్ న్యూస్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ సూచనలు ఇచ్చింది. మరి ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఏంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందామా..

ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి విదర్భ & మరాఠ్వాడ అంతర్భాగముగా మధ్య మహారాష్ట్ర ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించబడినది. నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి మధ్య మహారాష్ట్ర, పరిసర ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఈరోజు తక్కువగా గుర్తించబడినది. నిన్నటి నైరుతి బంగాళాఖాతంలో దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 & 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడినది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు:- —————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి:- ————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు:- —————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి:- ————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:- ———————————–
ఈరోజు :- —————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.