ఇష్టదైవాన్ని దర్శించుకోవాలనే ఆతృతతో.. కాలువలో స్నానానికి దిగి.. ఆపై
శివయ్యను దర్శించుకోవాలని స్నేహితులతో కలిసి బయల్దేరారు. స్నానం చేసేందుకు కాలువలో(Canal) దిగారు. నీటి ఉద్ధృతిని అంచనా వేయలేక ముగ్గురూ మునిగిపోయారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడగా...
శివయ్యను దర్శించుకోవాలని స్నేహితులతో కలిసి బయల్దేరారు. స్నానం చేసేందుకు కాలువలో(Canal) దిగారు. నీటి ఉద్ధృతిని అంచనా వేయలేక ముగ్గురూ మునిగిపోయారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు(Dead bodies) లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) కరప గ్రామానికి చెందిన అజయ్‌కుమార్ తన స్నేహితులు యశ్వంత్‌రాజా, మణికంఠ లతో కలిసి ముక్తేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. స్నానం చేసుకుని శివయ్యను దర్శించుకోవాలని భావించి.. ముగ్గురూ కాలువలోకి దిగారు. లోతు అంచనా వేయలేకపోవడంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి మణికంఠను కాపాడారు. మిగతా ఇద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించగా నీటి ప్రవాహం అధికమై చూస్తుండగానే కొట్టుకుపోయారు. సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చేపట్టగా అజయ్ మృతదేహం లభ్యమైంది. కొన ఊపిరితో ఉన్న యశ్వంత్ ను ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడు. పండుగ పూట ఈ విషాదం ఘటన జరగడంతో మృతుల తల్లిందండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ముగ్గురం నీటిలోకి దిగాం. ఎవరో నా కాలు పట్టుకున్నారనిపించి, నేను పైకి తేలిచూసే సరికి యశ్వంత్, అజయ్ కనిపించలేదు. రక్షించండీ అని అరిచా. అక్కడున్నవారు ముందు యశ్వంత్‌ను ఒడ్డుకు తెచ్చి, ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తరువాత అజయ్ మృతదేహం దొరికింది. కళ్లముందే ఫ్రెండ్స్‌ను కోల్పోయాను. – మణికంఠ
Also Read
Russia-Ukraine War: మాతృభూమి కోసం తీవ్రమైన పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ పౌరులు.. పెట్రో బాంబులతో
Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ వెనుక ఆంతర్యం అదేనా.. ఆసక్తికర కథనం మీకోసం..!
Porsche cars: సముద్రం మధ్యలో పోర్షా కార్లు.. దాదాపు 1,100 పోర్షా కార్లు.. ఏం జరిగిందంటే..? (వీడియో)