Porsche cars: సముద్రం మధ్యలో పోర్షా కార్లు.. దాదాపు 1,100 పోర్షా కార్లు.. ఏం జరిగిందంటే..? (వీడియో)

Porsche cars: సముద్రం మధ్యలో పోర్షా కార్లు.. దాదాపు 1,100 పోర్షా కార్లు.. ఏం జరిగిందంటే..? (వీడియో)

Anil kumar poka

|

Updated on: Mar 02, 2022 | 7:32 PM

అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్యలో అజోర్స్‌ ద్వీపాల దగ్గర ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. పోర్చుగీసు నావికా దళాలు చేరుకుని నౌకలో 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ నౌకలో 3,965 విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం "ఫెసిలిటీ ఏస్' నౌక


అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్యలో అజోర్స్‌ ద్వీపాల దగ్గర ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. పోర్చుగీసు నావికా దళాలు చేరుకుని నౌకలో 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ నౌకలో 3,965 విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం “ఫెసిలిటీ ఏస్’ నౌక ఓ ‘విగతజీవి’లా తేలుతూ ఉంది. మంటలు ఆర్పి నౌకను ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని తయారైన పోర్షా, ఆడీ, లంబోర్గినీ, వోక్స్‌వ్యాగన్‌ కార్లను ఎండెన్‌ పోర్టు నుంచి అమెరికాలోని మెక్సికో పోర్టుకు తరలించేందుకు నౌక బయలుదేరగా.. మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 1,100 పోర్షా కార్లు నౌకలో ఉన్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి ల్యూక్ తెలిపారు. గతంలోనూ ఓసారి సముద్రంలో పోర్షా కార్లు మునిగిపోయాయి. గ్రాండే అమెరికా అనే భారీ నౌక 2019లో మంటలు అంటుకొని మునిగిపోయింది. దాంతోపాటే అందులో ఉన్న ఆడీ, పోర్షే కార్లూ మునిగిపోయాయి.

మరిన్ని చూడండి ఇక్కడ: