Vizag: వామ్మో.. రాత్రి వేళ ఒక్కసారిగా పక్కకి ఒరిగిన రెండు భవనాలు.. వణికిపోయిన జనం.. వీడియో చూశారా..
విశాఖలో ఐదంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. వెలంపేట, పూల వీధిలో పక్క పక్కనే ఉన్న రెండు భవనాలు పక్కకి ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెలంపేట రాత్రి ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. దాంతో హుటాహుటిన ఆ భవంతిలో నివాసం ఉంటున్న వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు.

విశాఖలో ఐదంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. వెలంపేట, పూల వీధిలో పక్క పక్కనే ఉన్న రెండు భవనాలు పక్కకి ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెలంపేట రాత్రి ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. దాంతో హుటాహుటిన ఆ భవంతిలో నివాసం ఉంటున్న వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. రెండేళ్ల క్రితం నిర్మించిన కశిరెడ్డి ప్లాజాలో తొమ్మిది కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే మూడేళ్ల క్రితం మరో భవంతి ధరణి ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఈ రెండూ అనుమతులకంటే ఎక్కువ అంతస్థులు నిర్మించారు. కొద్దిరోజుల క్రితం కశిరెడ్డి ప్లాజా బిల్డింగ్ కుడి వైపున ఉన్న ఫంక్షన్ హాల్ బిల్డింగ్ పైకి వాలింది. ఇటీవల వర్షాలు కురవడంతో మరింతగా ఒరిగిపోయింది. భవనం పిల్లర్లు బీటలు వారాయి. దీనిని గమనించిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో రాత్రి జీవీఎంసీ అధికారులు, పోలీసులు, ఆ భవంతిలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. బిల్డింగ్ యజమానులకు నోటీసులిచ్చారు.
వీడియో చూడండి..
అయితే, అనుమతులు ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించడం వల్లే ప్రమాదకరంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదకరంగా మారిన బిల్డింగును కూల్చివేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. 40 లక్షల చొప్పున ఫ్లాట్ కొనుగోలు చేశామని యజమానులు అంటున్నారు.. ఒక్కరోజులోనే జీవీఎంసీ అధికారులు భవనాన్ని ఖాళీ చేయాలన్నారు.. సామాన్లు భవనంలోనే ఉంచి కుటుంబాలతో బయటకు వెళ్లిపోయామని.. అధికారులు, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటున్నారు ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
