Andhra Pradesh: టీవీ9 కథనాలకు స్పందన.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ‘నాఫెడ్’ గ్రీన్ సిగ్నల్..

Andhra Pradesh: పంటకు ధర లేక అల్లాడుతోన్న కోనసీమ కొబ్బరి రైతన్నపై టీవీ9 ప్రసారాలకు స్పందన లభించింది. త్వరలోనే అక్కడ కొనుగోలు కేంద్రాలు..

Andhra Pradesh: టీవీ9 కథనాలకు స్పందన.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ‘నాఫెడ్’ గ్రీన్ సిగ్నల్..
Coconut
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 25, 2022 | 12:57 PM

Andhra Pradesh: పంటకు ధర లేక అల్లాడుతోన్న కోనసీమ కొబ్బరి రైతన్నపై టీవీ9 ప్రసారాలకు స్పందన లభించింది. త్వరలోనే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. కోనసీమలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు నాఫెడ్ ముందుకొచ్చింది. కోనసీమలో సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకోవాలంటూ టీవీ9 కథనాలను ప్రసారం చేసింది. కొబ్బరికి గిట్టుబాటు ధర లేక రైతులు విల విలలాడుతున్న వైనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. వీటికి స్పందించిన కేంద్రప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల1వ తేదీ నుంచి కోనసీమలో ఐదుచోట్ల నాఫెడ్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్టు ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకరరావు తెలిపారు.

కోనసీమలోని అంబాజీపేట, నగరం, కొత్త పేట, ముమ్మిడివరం, తాటిపాక మార్కెట్ యార్డుల్లో వచ్చే నెల ఒకటి నుంచి కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఆరు నెలల పాటు ఈ కొనుగోలు సెంటర్లు కొనసాగుతాయి. 4,250 మెట్రిక్ టన్నుల కొబ్బరి కొనుగోలు చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. కొబ్బరి కొనుగోలు చేసే ప్రాంతాలను కేంద్ర నోడల్ బృందం పరిశీలిస్తుంది. రైతులకు మూడు రోజుల్లోనే వారి ఖాతాలకు డబ్బు డిపాజిట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కోనసీమలో వరి పంట తరువాత.. కొబ్బరి పంటదే అగ్రస్థానం. దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న కోనసీమ కొబ్బరి ఇప్పుడు తవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆరుగాలం కష్టించి, పండించిన పంటకు ధరలు లేక, ఎగుమతులు రాక కోనసీమ కొబ్బరి రైతాంగం దిగాలుపడింది. వేలాది ఎకరాల్లో కొబ్బరి పంట నిల్వలు పెరిగిపోయి కొబ్బరి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితికి చేర్చింది. వీళ్లను ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.