TTD: పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలకు టీటీడీ గుడ్‌న్యూస్.. అడ్రస్ పంపితే చాలు ఫ్రీగా..

కొత్తగా పెళ్లి చేసుకొని జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. కొత్తగా పెళ్లైన వధూవరులు తమ పూర్తి చిరునామాతో శుభలేఖలు టీటీడీకి పంపితే.. శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకంతో పాటు ప్రసాదంను పోస్టులో పంపనుంది.

TTD: పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలకు టీటీడీ గుడ్‌న్యూస్.. అడ్రస్ పంపితే చాలు ఫ్రీగా..
Ttd Blessings For Newlyweds

Edited By:

Updated on: Dec 24, 2025 | 10:22 AM

నూత‌నంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. కొత్తగా పెళ్లైన వధూవరులు తమ పూర్తి చిరునామాతో శుభలేఖలు టీటీడీకి పంపితే.. శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకంతో పాటు ప్రసాదంను పోస్టులో పంపనుంది. ప్ర‌తి ఏడాది శుభ‌లేఖ పంపిన‌ ల‌క్ష‌కు పైగా వ‌ధువ‌రుల‌కు శ్రీ‌వారి దీవెనలతో ఇలా క‌ల్యాణం జ‌రుగుతోంది. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించే నూతన వధువరులకు ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందే ముంది. ఇందుకు చేయాల్సింది అంతా ఒక్కటే. పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను టీటీడీకి పంపాలి.

గృహస్థ ధర్మం ఎంతో కీలకం

నవసమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనది. వధువరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధువు ఎడమ చేతికి ధరింప చేస్తారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణధారణకు కంకణం పంపుతారు. వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని, సత్కర్మలు పెంపొందాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలని, సిరిసంపదలు కలగాలని టీటీడీ కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది.

అలాగే నూతన వధువరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు కల్యాణ సంస్కృతి పేరిట ఒక పుస్తకాన్ని, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీల ఫోటోలతో కూడిన వేద ఆశీర్వచన పత్రికను సైతం టిటిడి కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల తపాలా విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం ల‌క్ష‌కు పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందిస్తున్నారు.

ఈ చిరునామాకు శుభలేక పంపండి

శ్రీవారి ఆశీస్సులు పొందాలనుకునే నూతన వధూవరులు త‌మ పూర్తి చిరునామాతో కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి 517501 పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం.155257 సంప్రదించాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.