టీటీడీ న్యూ రూల్.. ఇకపై తిరుమలలో పెళ్లికి ఆ సర్టిఫికెట్ తప్పనిసరి!
లవ్ మ్యారేజ్ అయినా.. ఎరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇలాంటి వారి కోసం టీటీడీ కల్యాణవేదికలో ఉచితంగా వివాహాలు జరిపిస్తుంది. దీని కోసం వధూవరులు తమ పుట్టిన తేదీలు, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటుగా తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, శుభలేఖ, లగ్న పత్రికను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు ఈ పెళ్ళికి హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే.. పెళ్లి అప్లికేషన్‌కు వారి […]

లవ్ మ్యారేజ్ అయినా.. ఎరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇలాంటి వారి కోసం టీటీడీ కల్యాణవేదికలో ఉచితంగా వివాహాలు జరిపిస్తుంది. దీని కోసం వధూవరులు తమ పుట్టిన తేదీలు, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటుగా తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, శుభలేఖ, లగ్న పత్రికను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు ఈ పెళ్ళికి హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే.. పెళ్లి అప్లికేషన్‌కు వారి డెత్ సర్టిఫికెట్ తప్పకుండా జత చేయాలి. అయితే ఇప్పుడు తాజాగా వీటితో పాటుగా ఇంకో కఠినతరమైన నిబంధనను టీటీడీ కొత్తగా ప్రవేశపెట్టింది.
ఇకపై తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను కూడా పొందుపరచాలంటూ టీటీడీ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సర్టిఫికెట్‌ను వధూవరులు ఎమ్మార్వో ఆఫీస్ నుంచి పొందవచ్చు. అయితే టీటీడీ ఇటువంటి నిబంధనను విధించడానికి కారణం లేకపోలేదు. కొందరు మహిళలు, పురుషులు గతంలో పెళ్లి చేసుకుని విడిపోయి.. తిరుమలకు వచ్చి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడంతో మొదటి భర్త/భార్య నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. ఇందువల్లే అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.