TTD – Ghat Roads: తిరుమల ఘాట్‌ రోడ్డు విషయంలో టీటీడీ మాస్టర్‌ ప్లాన్‌.. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా ఉండేందుకై..

|

Dec 06, 2021 | 9:13 AM

TTD - Ghat Roads: తిరుమల ఘాట్‌ రోడ్డు విషయంలో టీటీడీ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది. వర్షాల కారణంగా మళ్లీ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది.

TTD - Ghat Roads: తిరుమల ఘాట్‌ రోడ్డు విషయంలో టీటీడీ మాస్టర్‌ ప్లాన్‌.. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా ఉండేందుకై..
Tirumala Ghat Roads
Follow us on

TTD – Ghat Roads: తిరుమల ఘాట్‌ రోడ్డు విషయంలో టీటీడీ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది. వర్షాల కారణంగా మళ్లీ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా.. కొండచరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం కేరళ ప్రొఫెసర్లను ఆహ్వానించింది టీటీడీ. ఈ ఆహ్వానం మేరకు వచ్చిన కేరళ అమృతా విశ్వవిద్యాలయం నిపుణుల బృందం.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను పరిశీలించింది. ఈ బృందంలో సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. వారు అమృతా విశ్వవిద్యాలయంలో వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ అంతర్జాతీయ ప్రోగ్రామ్ చేస్తున్నారు. కొండ‌చ‌రియ‌లు విరిగిపడ్డ ప్రాంతంలో పున‌రుద్ధర‌ణ ప‌నులు, భ‌విష్యత్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా అత్యాధునిక ప‌రిజ్ఞానంతో స‌ర్వేచేసి టీటీడీకి నివేదిక అందించనున్నారు.

కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. టన్నుల బరువున్న పెద్ద పెద్ద బండరాళ్లు పైనుంచి పడటంతో రోడ్డు, రక్షణ గోడలు ధ్వంసం అయ్యాయి. రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది టీటీడీ. అయితే, భవిష్యత్తులో కొండచరియలు విరిగి పడకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది టీటీడీ. ఇందులో భాగంగా ఐఐటీ నిపుణులు బృందాన్ని తిరుమలకు పిలిపించింది. వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. తిరుమలకు ప్రత్యామ్నాయ రహదారి ఉంటే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నిపుణుల బృందం. ఇటీవలే తిరుమల ఘాట్‌ రోడ్ ఇష్యూపై సమీక్ష నిర్వహించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని ఆ సమీక్షలో నిర్ణయించింది టీటీడీ.

Also read:

Skin Care Tips: పుదీనాతో చర్మ సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు.. ఫేస్ ప్యాక్, స్క్రబ్ ఎలా తయారుచేయాలంటే..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త భయం.. వరుస దారుణాలతో హడలిపోతున్న జనాలు.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..!

Burning Topic LIVE : దొంగా దొంగా… | ప్రత్యామ్నాయ సేద్యం సాధ్యమా ?(లైవ్ వీడియో)