TS EAMCET: ఎంసెట్ ఫస్ట్‌ ర్యాంకర్‌ అనిరుద్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఎంటో తెలుసా.? ఆయన పేరెంట్స్‌ మాటల్లోనే..

|

May 25, 2023 | 9:34 PM

తెలంగాణ ఎంసెట్‌ 2023 ఫలితాలను గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం , అగ్రకల్చర్‌లో 86 శాతం శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల్లో విశాఖకు చెందిన అనిరుద్‌..

TS EAMCET: ఎంసెట్ ఫస్ట్‌ ర్యాంకర్‌ అనిరుద్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఎంటో తెలుసా.? ఆయన పేరెంట్స్‌ మాటల్లోనే..
Ts Eamcet
Follow us on

తెలంగాణ ఎంసెట్‌ 2023 ఫలితాలను గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 80 శాతం , అగ్రకల్చర్‌లో 86 శాతం శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల్లో విశాఖకు చెందిన అనిరుద్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించాడు. అనురుద్ విజయవాడలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అనిరుద్ పేరెంట్స్‌ తమ కొడుకు సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

అనురుద్‌ తండ్రి ఖగేశ్వరరావు విఖాఖలో క్రైమ్‌ ఎస్‌ఐగా సేవలందిస్తున్నారు. తనయుడు ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడం పట్ల ఖగేశ్వరావు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చిన వెంటనే అనిరుద్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు. ఇక తమ కొడుకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని అనురుద్‌ పేరెంట్స్‌ పేర్కొన్నారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

కొడుకు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలనే తమ కొరికను అనిరుద్‌ సాకారం చేశాడని చెప్పుకొచ్చారు. ఏ పరీక్ష అయిన బెస్ట్ ఇవ్వాలని ఎప్పుడూ చెప్పే వాళ్లమని . అదే కాన్ఫిడెన్స్ ఇస్తుందని చెప్పామన్నారు. బిట్ సెట్, ఏపీ ఎంసెట్ కూడా అనిరుద్ రాశాడని అంటున్నారు పేరెంట్స్. సినిమాలంటే ఇష్టమని.. కానీ పుస్తకాలతో కుస్తీ పడుతుంటాడని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..