Andhra Pradesh: జీవో 52ను రద్దు చేయాల్సిందే..ఆదివాసీల ఆందోళనలతో అట్టుడుకుతోన్న అల్లూరి జిల్లా

అల్లూరి జిల్లా చింతూరు ఆదివాసీల ఆందోళనలతో దద్దరిల్లుతోంది. జీఓ నంబర్‌ 52ను రద్దు కోసం రోడ్డెక్కారు గిరిపుత్రులు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై ఏపీలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం.. బోయ, వాల్మీకులను ఎస్టీజాబితాలో చేర్చుతూ జీవో నంబరు 52 విడుదల చేసింది.

Andhra Pradesh: జీవో 52ను రద్దు చేయాల్సిందే..ఆదివాసీల ఆందోళనలతో అట్టుడుకుతోన్న అల్లూరి జిల్లా
Tribals Protest

Updated on: Apr 06, 2023 | 6:40 AM

అల్లూరి జిల్లా చింతూరు ఆదివాసీల ఆందోళనలతో దద్దరిల్లుతోంది. జీఓ నంబర్‌ 52ను రద్దు కోసం రోడ్డెక్కారు గిరిపుత్రులు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై ఏపీలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం.. బోయ, వాల్మీకులను ఎస్టీజాబితాలో చేర్చుతూ జీవో నంబరు 52 విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలు ఆందోళనలకు దిగారు. ఎస్టీ జాబితాల్లో కొత్త చేర్పులపై చింతూరు మండలం ఎర్రంపేట ప్రధాన రహదారిపై ఆదివాసీ JAC నేతృత్వంలో ఆదివాసులు ధర్నాకి దిగారు. బోయ, వాల్మీకలను ఎస్టీ జాబితాలో కలిపే జి.ఓ నెం : 52 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గత కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు ఆదివాసీ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ఎర్రంపేటలో ఎమ్మెల్యే ధనలక్ష్మిని అడ్డుకున్నారు ఆదివాసీ జేఏసీ నాయకులు. రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న ఆదివాసీలు ఎమ్మెల్యేని అడ్డుకుని తమ గోడు వినిపించారు. రాస్తారోకో చేస్తోన్న ఆదివాసీలను అడ్డుతొలగించే ప్రయత్నం చేయగా..రహదారిపై తోపులాట జరిగింది.

తమ దైన ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక భాష, ప్రధానంగా ప్రత్యేక జీవన విధానంలాంటి మొత్తం ఆరు లక్షణాలున్న గిరిపుత్రులనే ట్రైబల్స్‌గా పేర్కొంది రాజ్యాంగం. అలాంటిది ఒక్క కలంపోటుతో ఆదివాసుల జాబితాలో బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చడం దారుణమని మండిపడుతున్నారు ఆదివాసీ జేఏసీ నాయకులు. కాగా చింతూరు మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటనకు రాగా, గిరిజనులు ఆమెను అడ్డుకొని నిరసన తెలిపారు. తక్షణమే అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బోయ, వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఆదివాసీ ఎమ్మెల్యేగా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.