Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercedes Benz Tractor Accident: ఇదేం రోడ్డు ప్రమాదంరా బాబు.. కారు, ట్రాక్టర్ ఢీ.. ముక్కలు ముక్కలైన ట్రాక్టర్..

ఓ వైరల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలా చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో మెర్సిడెస్ కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఢీకొన్న మెర్సిడెస్ కారు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ ట్రాక్టర్ మాత్రం ముక్కుముక్కలైంది.

Mercedes Benz Tractor Accident: ఇదేం రోడ్డు ప్రమాదంరా బాబు.. కారు, ట్రాక్టర్ ఢీ.. ముక్కలు ముక్కలైన ట్రాక్టర్..
Tractor Collision With Merc
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 27, 2022 | 6:43 PM

భారతదేశంలో కారు ప్రమాదం ఒక సాధారణ విషయం. కానీ కొన్ని ప్రమాదాలు మనకు ఏదో కొత్త పాఠం నేర్పుతాయి. కొన్ని కారణాల వల్ల ఆ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారుతాయి. ప్రస్తుతం ఇలాంటి వైరల్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో మెర్సిడెస్ కారును ఢీకొనడంతో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఢీకొన్న మెర్సిడెస్ కారు పెద్దగా నష్టం వాటిల్లలేదు. అదే ట్రాక్టర్ మాత్రం తుక్కుతుక్కయ్యింది. ట్రాక్టర్ ముక్కులు ముక్కులుగా మారడంతో ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఘటనలో మెర్సిడెస్ వాహనం ముందు భాగం మాత్రమే స్వల్పంగా దెబ్బతినగా, ట్రాక్టర్ రెండు ముక్కలుగా రోడ్డుపై పడి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనలో హైవేపై ట్రాక్టర్ రివర్సులో పడిపోగా.. అదే కారు మాత్రం ఓ అడుగు కూడా ముందుకు కదలలేదు.

ఓ కారు.. ట్రాక్టర్‌ ఢీ కొంటే ఇలా ఉంటుందా.. అనేలా అక్కడి ప్రమాద దృశ్యం కనిపిస్తోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. తిరుపతి సమీపంలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, రాంగ్‌ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ కారును ఢీ కొట్టింది.  అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం. ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకోగా.. కారులో ఉన్నవారు కూడా సురక్షితంగా ఉన్నారు.

ఈ వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కారు ఎడమ వైపున చిన్నగా దెబ్బతినగా, ట్రాక్టర్ మూడు ముక్కలయ్యింది. ట్రాక్టర్ కారును ఢీ కొనడంతో ట్రాక్టర్ ఇలా ముక్కులయి ఉండవచ్చని భావిస్తున్నారు. మెర్సిడెస్‌లోని వ్యక్తులు సురక్షితంగా ఉండటం కూడా విచిత్రం. కొద్ది రోజుల క్రితం పెద్ద పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతను కూడా మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం