Tomato Prices Falling Down: కొన్ని రోజుల క్రితం వరకూ టమాటా ధర(Tomato Price) చుక్కలను తాకింది. గత ఏడాది చివరిలో ఆంధ్ర ప్రదేశ్ లో కురుసిన వర్షాలతో టమాటా ధర ఆల్ టైం హై కు చేరుకుంది. రైతులకు లాభాలను.. సామాన్యులకు కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాటా ధరలు అకస్మాత్తుగా నేలచూపులు చూస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ కిలో రూ.40, రూ. 50 ఉన్న టమాటా ధర.. నేడు కిలో పది రూపాయలు అన్నా కొనేవారు లేరు.
కుప్పకూలిన టమోటా ధర…
కర్నూలు జిల్లాలో టమోటా ధరలు చిత్రవిచిత్రంగా పలుకుతున్నాయి. కిలో టమోటా ధర వంద రూపాయల నుంచి ఏకంగా పది రూపాయలకు పడిపోయింది. మార్కెట్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు ఉండటంతో ఎప్పుడు ధర ఉంటుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో టమోటా మార్కెట్ లో మదనపల్లి తర్వాత అతిపెద్దది పత్తికొండ మార్కెట్. ప్రతిరోజు టన్నుల కొద్ది టమోటా మార్కెట్ కు తరలి వస్తున్నది. ఇక్కడే టమోటా చాలా రుచికరంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతోంది. దీంతో రైతులు విపరీతంగా సాగు చేశారు అధిక వర్షాల కారణంగా దిగుబడి ఈసారి పూర్తిగా తగ్గిపోయింది. ధరల మాత్రం ఈసారి సంతృప్తినిచ్చినప్పటికీ ఎక్కువ రోజులు నిలకడగా ఉండడం లేదు. మొన్నటి వరకు 100 రూపాయలు పెరిగిన టమోటా ధర ఆ తర్వాత 50, 30, 27,… నేడు 10 రూపాయలకు పడిపోయింది… ఇంకా పడి పోతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది… ధరలు తగ్గకుండా ఎగుమతులు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమోటా పంట అధికంగా పండుతుంది. ముఖ్యంగా మదనపల్లిలో టమాటా అధికంగా పండిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటె.. ఒకే.. అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ధర ఉన్న సమయంలో వర్షాలు, వరదలు.. చేతికి పంట అంది వచ్చే సరికి ధర లేకపోవాడంతో అక్కడ టమాటా రైతులు విపరీతంగా నష్టపోతున్నారు.
గత ఏడాది ఆల్ టైం హై:
గత ఏడాది నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో టమోటా పంట దెబ్బతింది. దీంతో ఆ సమయంలో టమాటా ధర కిలో 150 వరకూ చేరుకుంది. రైతులకు సిరులు.. సామాన్యులకు అందని ద్రాక్షగా నిలిచింది ఆ సమయంలో.. అయితే ఇప్పుడు చిత్తూరు, అనంతపురం జిలాల్లో టమాటా పంట రైతుల చేతికి వచ్చింది. అయితే ఇతర రాష్ట్రాలనుంచి టమాటా దిగుమతి ఉండడంతో.. ఇప్పుడు స్థానిక టమాటా ధర పంటకు ధర వచ్చే పరిస్థితులు లేవు. దీంతో స్థానిక టమాటా పంటకు ధరలు లేక రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
TV9 Reporter :Nagi Reddy Kurnool
Also Read: అమ్మాయిలు గూగుల్ సెర్చ్ లో అధికంగా వేటిని ఎక్కువుగా వెదకడానికి ఆసక్తి చూపిస్తారో తెలుసా..