AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: అమ్మాయిలు గూగుల్ సెర్చ్ లో వేటిని అధికంగా వెతుకుతారో తెలుసా..

Google: స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్,  యుట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత  నెలల పిల్ల నుంచి పండు ముసలి వారు, స్త్రీ, పురుషులు..

Google: అమ్మాయిలు గూగుల్ సెర్చ్ లో వేటిని అధికంగా వెతుకుతారో తెలుసా..
Girl Google Search
Surya Kala
|

Updated on: Jan 20, 2022 | 8:55 AM

Share

Google: స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్,  యుట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత  నెలల పిల్ల నుంచి పండు ముసలి వారు, స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా అందరు ఉపయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిండి లేకపోయినా ఉంటారేమో గానీ.. స్మార్ట్ ఫోన్ లేకపోతె బతకలేరు అన్నచందంగా మారింది. అయితే తాజాగా గూగుల్ తన సెర్చ్ తాజాగా ఓ నివేదికను అందించింది, ఇందులో మహిళలు ఎంత సేపు ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు… ఏయే విషయాలను తెసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు వంటి అనేక విషయాలు తెరపైకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే..

ఒక నివేదిక ప్రకారం..  భారత దేశంలో దాదాపు 150 మిలియన్లు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో దాదాపు 60 మిలియన్ల మంది మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. వీరిలో 75% మంది మహిళలు 15-34 ఏళ్ల మధ్య వయస్కులే. వీరు తమ జీవన విధానాన్ని మెరుగు పరచుకోవడానికి ఎక్కువుగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో ఏమి వెతుకుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కెరీర్ కు సంబంధించి:

అమ్మాయిలు ఎక్కువగా కెరీర్ సంబంధిత సమాచారం ఎక్కువగా వెతుకుతున్నారని నివేదిక ప్రకారం తెలుస్తోంది. తమ కెరీర్ ను ఎలా మలచుకోవాలి. ఏ విధమైన కోర్సులు ఎంచుకోవాలి. తమకు ఎదురైన ఛాలెంజ్ లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు.

ఆన్‌లైన్ షాపింగ్ : గత కొంతకాలంగా అమ్మాయిలు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. బట్టల డిజైన్‌లు, కొత్త కలెక్షన్లు, ఆఫర్‌ల వంటి వాటిని సెట్స్ లో ఎక్కువగా వెదుకుతున్నారని తెలిసింది.

అందం కోసం చిట్కాలు:

నేటి యువత అందంగానే కాదు.. డి:ఫరెంట్ స్టైల్ లో కనిపించడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే బ్యూటీ టిప్స్, ఫ్యాషన్ ట్రెండ్స్,  హోం రెమెడీస్ గురించి ఎక్కువగా వెదుకుతున్నారని అధ్యయనాల ద్వారా తెలిసింది.

మెహందీ డిజైన్ కోసం:

ఎప్పుడు ఏ కాలంలో నైనా అమ్మాయిలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కాలం తెచ్చిన మార్పుల్లో భాగంగా అమ్మాయిలు గోరింటాకు బదులు మెహందీ డిజైన్స్ ను పెట్టుకుంటున్నారు. అందుకనే అమ్మాయిలు తరచుగా గూగుల్‌లో హెన్నా లేటెస్ట్ డిజైన్‌లను వెతుకుతున్నారట.

రొమాంటిక్ సంగీతం:  సంగీతం వినడానికి అందరూ ఆసక్తిని చూపిస్తారు. అయితే అమ్మాయిలు మాత్రం ఆన్ లైన్ లో రొమాంటిక్ పాటలను వినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ మేరకు సెర్చ్ చేస్తారట. అంతేకాదు అమ్మాయిలు ఇంటర్నెట్‌లో రొమాంటిక్ కవిత్వాన్ని కూడా వెతుకుతారని అధ్యయనంలో తెలిసింది.

Also Read:

AP Corona Cases: బుసలు కొడుతున్న కరోనా.. ఏపీలో ఉగ్రరూపం.. పెరిగిపోయిన పాజిటివిటీ రేటు..