TTD: తిరుమల క్యూ లైన్‌లో నినాదాలపై టీటీడీ సీరియస్
తిరుమల క్యూ లైన్‌లో నినాదాల ఘటనపై TTD బోర్డ్ మండిపడింది. ఇదంతా పొలిటికల్ కుట్ర అని ఆరోపిస్తున్నారు బోర్డ్ మెంబర్లు. దీనివెనుక వైసీసీ హస్తం ఉండొచ్చని ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ..

టీటీడీపై వైసీపీ నేతలది అసత్య ప్రచారమని ఆరోపించారు టీటీడీ పాలకమండలి సభ్యుడు శాంతారాం. తిరుమల దర్శనానికి వచ్చిన వైసీపీ నేతలు..పథకం ప్రకారమే టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్నారు శాంతారాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలోనూ వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు టీటీడీ పాలకమండలి సభ్యుడు. కుట్ర పూరితంగానే సోషల్ మీడియాలో టీటీడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని.. టీటీడీపై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు శాంతారాం.
ఇక దేవుడి చుట్టూ వైసీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు TTD సభ్యుడు భానుప్రకాష్. తిరుమలపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దానివెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు భానుప్రకాష్. కుట్రదారులపై చర్యలు తీసుకోవాలంటూ DGPతో పాటు, ఇంటెలిజెన్స్ DGకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




