TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అంగప్రదక్షిణ, ప్రత్యేక దర్శనం, గదుల టోకెన్లు విడుదల

కాగా,.. మంగళవారం ఉదయం 10గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలో అర్చకులు శాంతి హోమం నిర్వహించారు.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అంగప్రదక్షిణ, ప్రత్యేక దర్శనం, గదుల టోకెన్లు విడుదల
Tirumala

Updated on: Sep 23, 2024 | 12:06 PM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ వెల్లడించింది. తిరుమల, తిరుపతి దేవస్థానం డిసెంబర్‌ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం , శ్రీవాణి టికెట్ల ను సోమవారం విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్‌ 2024 నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3గంట‌ల‌కు విడుద‌ల చేస్తుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్‌లను సోమవారం ఉదయం 10గంటలకు టీటీడీ విడుదల చేసింది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, పెద్దలు, దివ్యాంగులకు సంబంధించిన నవంబర్ నెల ఉచిత దర్శన కోటా టికెట్స్‌ను విడుదల చేయనుంది. కాగా.. మంగళవారం ఉదయం 10గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి.

ఇదిలా ఉంటే, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలో అర్చకులు శాంతి హోమం నిర్వహించారు. వాస్తు శుద్ధి, శాంతి హోమం ముగిసింది. ఆలయంలో నెయ్యి వినియోగం జరిగిన ప్రదేశంలో సంప్రోక్షణ, లడ్డూ కౌంటర్‌తో లడ్డూ బూందీ ప్రదేశాలలో అర్చకులు సంప్రోక్షణలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..