AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala News: టిటిడికి మరో టాస్క్.. రంగంలోకి దిగిన ఎక్స్‌పర్ట్స్ టీమ్.. ఎందుకోసమంటే..

శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో కొండకు చేరే భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు టీటీడీ ఎన్నో అవస్థలు పడుతోంది. అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడులు తీవ్ర కలకలం సృష్టించగా.. టిటిడి శేషాచలం అభయారణ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏడుకొండలతో కూడిన శేషాచలం అడవులను ఎస్వీ అభయారణ్యంగా ప్రభుత్వం పాతికేళ్ళ క్రితమే ప్రకటించింది. 1998లో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల పరిధిలోని శేషాచలం అడవులను ఎస్‌వి అభయారణ్యంగా..

Tirumala News: టిటిడికి మరో టాస్క్.. రంగంలోకి దిగిన ఎక్స్‌పర్ట్స్ టీమ్.. ఎందుకోసమంటే..
TTD Walk Way
Raju M P R
| Edited By: |

Updated on: Aug 20, 2023 | 8:47 AM

Share

శేషాచలం అభయారణ్యంలోని క్రూరమృగాల బెడద ఇప్పుడు టిటిడికి పెద్ద టాస్క్ లా మారింది. నడక మార్గంలో చిన్నారులపై చిరుతల దాడితో కలవరపడుతున్న టిటిడికి ఇప్పుడు ఎలుగు బంటి వ్యవహారం మరో చాలెంజ్‌గా  మారింది. మూడు చిరుతలను బంధించిన టిటిడి, అటవీ శాఖ లకు చిరుతల సమస్యే కాదు, ఎలుగు బంటి సంచారం కూడా చిరాకు పుట్టిస్తోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఎలుగుబంటి బందించేందుకు ఎక్స్‌పర్ట్స్ టీమ్‌ను టిటిడి రంగంలోకి దింపింది.

శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో కొండకు చేరే భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు టీటీడీ ఎన్నో అవస్థలు పడుతోంది. అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడులు తీవ్ర కలకలం సృష్టించగా.. టిటిడి శేషాచలం అభయారణ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏడుకొండలతో కూడిన శేషాచలం అడవులను ఎస్వీ అభయారణ్యంగా ప్రభుత్వం పాతికేళ్ళ క్రితమే ప్రకటించింది. 1998లో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల పరిధిలోని శేషాచలం అడవులను ఎస్‌వి అభయారణ్యంగా ప్రకటించగా ఎన్నో వృక్ష జంతు జాతులకు నిలయంగా ఈ అటవీ ప్రాంతం ఉండి పోయింది. 67,541.31 హెక్టార్ల విస్తీర్ణంలోని శేషాచలం అడవుల్లో 52,597 హెక్టార్లు నోటిఫికేషన్ ప్రకారం శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం పరిధిలో ఉంది. అభయారణ్యం పరిధిలోనే చిరుతలతో పాటు ఎలుగు బంట్లు, ఏనుగులు, అడవి కుక్కలు, అడవి పందులు, ముళ్ళ పందులు, నక్కలు, అడవి పిల్లులు, జింకలు, దుప్పిలు, కణతులతోపాటు ఎన్నో జీవరాసులు ఉన్నాయి.

బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ గా కూడా ప్రకటించిన శేషాచలం అటవీ ప్రాంతం నుంచి తరచూ బయటికి వస్తున్న క్రూర మృగాలు ఇప్పుడు నడక మార్గంలో శ్రీవారి భక్తులను హడలెత్తిస్తుండగా మ్యాన్ ఈటర్ గా మారిపోతున్నాయి. దీంతో క్రూర మృగాల నుంచి భక్తులను కాపాడేందుకు టీటీడీ, అటవీ శాఖలు ఆపరేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా 50 రోజుల్లోనే మూడు చిరుతలను బంధించి రెండు ఎస్వీ జూ కు, మరొక చిరుతను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన అటవీ శాఖ ఇప్పుడు మరిన్ని చిరుతల వేటను కొనసాగిస్తోంది.

ఇవి కూడా చదవండి

చిరుతల సమస్య ఒక్కటే కాకుండా శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల కంటపడిన ఎలుగుబంటి ఇప్పుడు అంతటా సంచరిస్తోంది. అలిపిరి నడకమార్గం వరకు అలజడి చేస్తుంది. దీంతో ఎలుగుబంటిని బంధించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేపట్టింది. కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేసి ఎలుగుబంటిని గుర్తించే పనిలో పడింది. ఎలుగుబంటిని బోన్లో బంధించేందుకు అవకాశం లేకపోవడంతో వల పన్ని పట్టుకునే పనిలో టీటీడీ 100 మందిని సిబ్బంది అహర్నిశలు పనిచేసేలా చర్యలు చేపట్టింది. ఎక్స్‌పర్ట్ టీమ్‌ను రంగంలోకి దింపింది. మరోవైపు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

ఇక శేషాచలం అడవుల్లో చిరుతలను, ఎలుగు బంట్లను గుర్తించి బంధించేందుకు ఏకంగా 500 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేసింది. అయితే ఎలుగు బంటి జాడ తెలిసినా బంధించడంలో సక్సెస్ కాలేకపోయిన టీటీడీ, ఫారెస్ట్ సిబ్బందికి ఎలుగుబంటి ఆపరేషన్ టాస్క్ లా మారిపోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..