Southern Zonal Council: తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన దక్షిణాధి రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సమస్యలపై అమిత్‌షా స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రాష్ట్రాలకు చెందినవి మాత్రమే కాకుండా ఇవి జాతీయ అంశాలని అన్నారు. ఏపీ సీఎం జగన్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలనే ప్రస్తావించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని అన్నారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు ఇంకా అమలు కావడం లేదని అన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కాకుండానే మిగిలిపోతున్నాయని, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుతుందని అన్నారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో 2013-14ధరతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని జగన్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించాలని, తీవ్ర కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిస్కంలకు ఊరట ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జగన్ కోరారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు కూడా సరిగ్గా జరగలేదని, రాష్ట్రాల్లో రేషన్ లబ్దిదారుల గుర్తింపు కోసం కేంద్రం ప్రక్రియలో హేతుబద్దత లేదని, వెంటనే సవరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఇవి కూడా చదవండి: