AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..

ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 20 నెలలుగా నడక మార్గంలో టిటిడి అప్రమత్తంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నడక మారాల్లో నో ఎంట్రీ పెట్టింది. మరోవైపు

Tirumala: అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..
Cheetah
Raju M P R
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 15, 2025 | 8:08 AM

Share

తిరుమల నడక మార్గాల్లో చిరుతల భయం ఇప్పట్లో వీడేటట్లు లేదు. చిరుతల సంచారం మెట్ల మార్గాల్లో మళ్ళీ భక్తులను వెంటాడుతోంది. గత 20 నెలలుగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఆంక్షలు మధ్య సాగుతున్న భక్తుల తిరుమల యాత్ర ఇప్పుడు మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు కారణం అలిపిరి నడక మార్గంలోని 7 వ మైలు వద్ద చిరుత సంచారమే. భక్తుల కంట పడ్డ చిరుత భక్తుల వెన్నులో వణుకు పుట్టించగా టిటిడి సెక్యూరిటీ, అటవీ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసింది.

తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది. చిరుత సంచారంతో మళ్ళీ భక్తుల్లో కలవరం మొదలైంది. నిన్న రాత్రి అలిపిరి నడక దారిలో 7 వ మైలు వద్ద చిరుత కనిపించడం, చిరుత సంచారంపై భక్తులు ఆందోళన మొదలైంది. గుబురుగా ఉన్న చెట్ల మద్య ఉన్న చిరుత నడక మార్గాన్ని దాటే ప్రయత్నం చేస్తుందని భక్తులు భయంతో వణికిపోయారు. కొందరు భక్తుల కదలిక లను గుర్తించిన చిరుత శబ్దానికి అడవి లోకి వెళ్లిపోగా విషయాన్ని భక్తులు టీటీడీ సెక్యూరిటీ దృష్టి తీసుకెళ్లాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని చిరుత జాడ తెలుసుకునే ప్రయత్నం చేసింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.

చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యింది. చిరుత కనిపించని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను పరిశీలించింది. ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 20 నెలలుగా నడక మార్గంలో టిటిడి అప్రమత్తంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నడక మారాల్లో నో ఎంట్రీ పెట్టింది. మరోవైపు నడక మార్గంలో భక్తులకు కర్రలు అందుబాటులోకి తెచ్చింది. టిటిడి స్వీయ రక్షణ కోసం ఊత కర్రలను భక్తులకు ఇస్తోంది.

ఇవి కూడా చదవండి

గుంపులు గుంపులు గానే అనుమతిస్తున్న టీటీడీ 7 వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. నడక మార్గం ఇరువైపులా ముళ్ళపొదలను తొలగించి, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసిన టిటిడి విజిలెన్స్, అటవీశాఖ నిరంతర గస్తీ నిర్వహిస్తోంది. అయితే టిటిడి భక్తుల స్వీయ రక్షణ కోసం విధించిన నిబంధనలను కొందరు భక్తులు సీరియస్ గా తీసుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడక మార్గంలో భక్తుడు చేతిలో కర్ర ఉండాలన్న నిబంధన అమలు చేస్తున్న టిటిడి రక్షణ కోసం కర్రలను టిటిడి సెక్యూరిటీ ఇస్తోంది.

అయితే కర్రలు తీసుకోకుండానే కొండ ఎక్కుతున్న కొద్దిమంది భక్తులు సాహసం చేస్తున్న పరిస్థితి ఉంది. మెట్ల మార్గం పైకి క్రూర మృగాలు చిరుతలు రాకుండా భక్తులు గోవింద నామ స్మరణతో నడక యాత్ర చేయాలని కూడా టిటిడి సూచిస్తోంది. మరోవైపు నడక మార్గంలో చిరుతల సంచారం వల్ల భక్తులకు ఇబ్బంది కలగ కుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో అన్నదానిపై అటవీశాఖ తో సమన్వయం చేస్తోంది. ఈ మేరకు వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ సైంటిస్ట్ టీం ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి పలు సిఫార్సులు చేసింది. అయితే ఇప్పుడు చిరుత మళ్ళీ కనిపించడంతో భక్తుల్లో భయం నెలకొంది. ఎండల తీవ్రత పెరగడం వేసవి సమీపిస్తుండటంతో ఇప్పుడు చిరుతల భయం కలవరపెడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..