Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. బస్సు జర్నీ ఫ్రీ.. అందరికీ అవకాశం..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. త్వరలో మరిన్ని ఉచిత బస్సులు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఈ బస్సులను శ్రీవారి ధర్మరథం పేరుతో తిప్పనున్నారు. భక్తులు ఉచితంగా ఇందులో ప్రయాణం చేయవచ్చు. సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ సంస్థ టీటీడీకి 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. ఈ బస్సులు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా.. ఇవి తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గతంలో టీటీడీకి 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను విరాళంగా ప్రకటించారు. వీటిల్లో 15 బస్సులు ఇప్పటికే అందించగా.. మిగతా 10 బస్సులు త్వరలోనే తిరుమలకు చేరుకోనున్నాయి. ప్రస్తుతం వచ్చిన బస్సులను త్వరలో ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బస్సులను సీఎం చంద్రబాబు త్వరలో ప్రారంభించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రబాబు తిరుమల రానుండగా.. ఆ సమయంలో వీటిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ బస్సుల్లో ఉచితంగా తిరుమల శ్రీవారి భక్తులు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఈ బస్సులకు టీటీడీ ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌లో ఛార్జింగ్ పెట్టారు. ఇటీవల టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఈ బస్సులను పరిశీలించారు. అనంత్ అంబానీ ఈ ఏడాది జూన్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. ఆ బస్సులకు అవసరమైన డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బస్సులు ఇప్పుడు తిరుమలకు చేరుకున్నాయి. ఇప్పటికే తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ధర్మరథాలను నడుపుతోంది. ఈ బస్సుల్లో భక్తులు ఉచితంగా తిరుమలలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ చేయవచ్చు. దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఈ బస్సులు బాగా ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు ఉండగా.. ఇవి భక్తుల అవసరాలకు సరిపోవడం లేదు. తిరుమలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కానీ బస్సులు కొన్ని మాత్రమే ఉండటం వల్ల నిరంతరం రద్దీ ఉంటుంది. ఈ బస్సుల్లో కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండటం లేదు. ఇప్పుడు మరిన్ని బస్సులు రానుండటంతో భక్తులక ఊరట కలిగింది.
ఈ నెల 8వ తేదీ నుంచి ఈ-వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుంబంధ ఆలయాల్లో భక్తులు హుండీ ద్వారా సమర్పించిన బియ్యంకు ఈ-వేలం నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ-వేలం పాట నిర్వహించనున్నారు. 7938 కిలోల బియ్యాన్ని వేలంలో ఉంచనున్నారు. ఇతర వివరాల కోసం టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలి. 0877-2264429 నెంబర్ లేదా http://www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను తెలుసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
