AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బూటుకాలితో తన్నులు తిన్న కుర్రాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతని సినిమా వస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

ఒకప్పుడు సినిమా షూటింగ్‌లో బూటుకాలితో తన్నులు తిన్న కుర్రాడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి, తన సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే స్థాయికి చేరుకున్నాడు. గతంలో ఆయన చెప్పిన పాత జ్ఞాపకాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బూటుకాలితో తన్నులు తిన్న కుర్రాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతని సినిమా వస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే
Hero
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2026 | 1:50 PM

Share

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్న ఓ కుర్రాడు.. నేడు స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. దాదాపు 25 ఏళ్లుగా సినీ రంగంలో కొనసాగుతూ.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి తన సత్తా చాటాడు. కథ నచ్చితే భాష, దర్శకుడు అనే తేడాలు చూడకుండా సినిమాలు చేసే ఆ హీరో మరెవరో కాదు.. తమిళ్ స్టార్ హీరో ధనుష్. హీరో ధనుష్‌కు తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు ధనుష్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్  అయ్యి విడుదలై మంచి ఆదరణ పొందాయి. అయితే ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

తెలుగులో ధనుష్ చేసిన తొలి సినిమాగా ‘సార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ధనుష్‌కు తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బిచ్చగాడిగా కనిపించి ఆకట్టుకున్నారు ధనుష్. ఇదిలా ఉంటే..మొన్నామధ్య చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

25 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తయిందని, ఇప్పుడు తన జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ధనుష్ తెలిపారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, విజయాలు, సవాళ్లు ఎదురయ్యాయని ఆయన గుర్తుచేసుకున్నారు. వేల్స్ యూనివర్సిటీతో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని ధనుష్ వెల్లడించారు. తన కెరీర్‌లో తొలి చిత్రం తుళ్లువదో ఇళమై షూటింగ్‌లో భాగంగా ఇక్కడికి వచ్చానని చెప్పారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో వేల్స్ యూనివర్సిటీ అధినేత, సినీ నిర్మాత డాక్టర్ ఐసరి కె. గణేష్ తనను బూటుకాలితో తన్నే సన్నివేశం ఉందని ధనుష్ తెలిపారు. సినిమా కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఆ అనుభవాన్ని ఇప్పుడు సరదాగా గుర్తుచేసుకున్నారు ధనుష్.  ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ప్రత్యేకమైనదని, ఆ రోజుల్లోని జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయని ఆయన పేర్కొన్నారు.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us