ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 కార్లు చోరీ.. కట్‌చేస్తే ఖాకీలకే షాకిచ్చే ట్విస్ట్‌లు..!

| Edited By: Jyothi Gadda

Dec 07, 2024 | 8:14 PM

గత కొన్ని రోజులుగా పలమనేరులో కొనసాగుతున్న చోరీ కేసు పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చోరీకి గురైన కార్లన్నీ సుబ్బన్నకు లీజుకి ఇచ్చిన కారులుగా గుర్తించారు పోలీసులు. దీంతో సుబ్బన్నను అదుపులకు తీసుకొని విచారిస్తే పోలీసులకు షాక్ ఇచ్చే నిజాలు బయటపడ్డాయి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 కార్లు చోరీ.. కట్‌చేస్తే ఖాకీలకే షాకిచ్చే ట్విస్ట్‌లు..!
Car Theif
Follow us on

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసం వెలుగు చూసింది. ట్రావెల్ ఏజెన్సీ పేరుతో కార్ల చోరీకి పాల్పడ్డ దొంగ అసలు నిజం బయట పడింది. పలమనేరు లోని అంబేద్కర్ నగర్ కు చెందిన సుబ్బన్న జోయల్ ది వృత్తి డ్రైవింగ్. యాక్టింగ్ డ్రైవింగ్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న సుబ్బన్న జోయల్ వ్యసనాలకు అలవాటు పడ్డాడు. మద్యం జూదం మత్తుకు బానిసై డబ్బు కోసం కొత్త అవతారం ఎత్తాడు. ట్రావెల్ ఏజెన్సీ పేరుతో వాహనాలను లీజుకు తీసుకొని బురిడీ కొట్టించాడు. దాదాపు 11 వాహనాలను పలమనేరులోనే సమకూర్చుకొని అద్దెలకు నడుపుతూ వచ్చాడు. బిజినెస్ బాగా జరిగే వరకు దర్జా గానే వాహనాలను నడుపుతూ వచ్చిన సుబ్బన్న జోయల్ జల్సాలకు అలవాటు పడ్డాడు.

ప్రతినెల లీజు మొత్తాన్ని యజమానులకు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. డబ్బు అవసరం 5 కార్లను తాకట్టు పెట్టించగా లీజుకు తీసుకున్న వాహనాలకు కొందరు ఓనర్లు వాపస్ తీసుకోవడంతో సుబ్బన్న జోయల్ చేతిలో చిల్లి గవ్వ లేకపోయింది. గత కొద్ది కాలంగా జల్సాలతో జోష్ గా బతికిన సుబ్బన్న జోయల్ కొత్త ప్లాన్ వెతికాడు. లీజుకు తీసుకున్న కార్లు కొన్ని తాకట్టులో, మరికొన్ని ఓనర్లు తీసుకెళ్ళిపోవడంతో దొంగ అవతారం ఎత్తాడు. లీజు పై కారు నడుపుతున్న సమయంలో డూప్లికేట్ కీస్ తయారు చేసుకున్న సుబ్బన్న కార్ల చోరీకి పాల్పడ్డాడు. ఓనర్లు కార్లలను పార్కింగ్ చేసే ఏరియాలు తెలిసిన సుబ్బన్న రాత్రికి రాత్రే వాహనాలను దొంగలించాడు. ఆ కార్లను కూడా తాకట్టుపెట్టి సొమ్ము చేసుకున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా పలమనేరులో కొనసాగుతున్న చోరీ కేసు పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చోరీకి గురైన కార్లన్నీ సుబ్బన్నకు లీజుకి ఇచ్చిన కారులుగా గుర్తించారు పోలీసులు. దీంతో సుబ్బన్నను అదుపులకు తీసుకొని విచారిస్తే పోలీసులకు షాక్ ఇచ్చే నిజాలు బయటపడ్డాయి.

వ్యసనాలకు అలవాటు పడి కార్ల ను చోరీ చేసి జల్సా లకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు సుబ్బన్నను అరెస్ట్ చేశారు. సుబ్బన్న జోయల్ తాగొట్టు పెట్టిన రూ.60 లక్షల విలువైన 11 కార్లను పోలీసులు రికవరీ చేసారు. సుబ్బన్నను రిమాండ్ కు పంపిన పోలీసులు కార్లను లీజుకు ఇచ్చి సుబ్బన్న చేతిలో మోసపోయిన యజమానులకు తిరిగి కార్లను అప్పచెప్పేందుకు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.