Tirupati: ఎస్వీ యూనివర్సిటీలో రోడ్ల రగడ.. నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం.. అయినా కొనసాగుతోన్న ఆందోళనలు.. వివరాలివే..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 08, 2023 | 5:33 PM

Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్ల రచ్చ కంటిన్యూ అవుతోంది. మూడు మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనతో ముందుకెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ వెనక్కి తగిన విద్యార్థి సంఘాలు మాత్రం ముందడుగు వేస్తూనే ఉన్నాయి. తరగతుల బహిష్కరణ, వర్సిటీ బంద్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. రాజకీయ వివాదంగా మారిపోవడంతో 3 రోడ్ల ప్రతిపాదన పక్కన పెట్టిన కౌన్సిల్ రెండు..

Tirupati: ఎస్వీ యూనివర్సిటీలో రోడ్ల రగడ.. నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం.. అయినా కొనసాగుతోన్న ఆందోళనలు.. వివరాలివే..
Sri Venkateswara University
Follow us on

తిరుపతి, ఆగస్టు 8: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్ల రచ్చ కంటిన్యూ అవుతోంది. మూడు మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనతో ముందుకెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ వెనక్కి తగ్గినా విద్యార్థి సంఘాలు మాత్రం ముందడుగు వేస్తూనే ఉన్నాయి. తరగతుల బహిష్కరణ, వర్సిటీ బంద్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఇదంతా రాజకీయ వివాదంగా మారిపోవడంతో 3 రోడ్ల ప్రతిపాదన పక్కన పెట్టిన కౌన్సిల్ రెండు రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్దమైంది. వర్సిటీ వాతావరణానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు డిజైన్లను మార్చి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం కోసం తీర్మానం చేసింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో అంతర్గత రోడ్ల నిర్మాణం వివాదాస్పదంగా మారిపోవడంతో కౌన్సిల్ నిర్ణయంలో మార్పు అనివార్యమైంది. అభివృద్ధి పేరుతో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్న తిరుపతి కార్పొరేషన్ ప్రతిపాదన రాజకీయ రచ్చను రాజేయడంతో వెనక్కి తగ్గింది. యూనివర్సిటీలోని ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసేలా రోడ్ల విస్తరణ పనులెందుకని విపక్షాలు, మరికొన్ని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తుండటం, అభివృద్ధి జరిగి తీరాల్సిందేనని అధికార పక్షం పట్టుపట్టడంతో ఎస్వీ యూనివర్సిటీలో రోడ్ల రాజకీయం తారాస్థాయికి చేరింది.

అయితే తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను చేపట్టిన తిరుపతి కార్పొరేషన్ యూనివర్సిటీలో కొత్తగా మూడు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రతిపాదించింది. ఈ మేరకు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ 3 రోడ్ల నిర్మాణంపై చొరవచూపడం, యూనివర్సిటీలో అంతర్గత రోడ్ల నిర్మాణం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించాలని ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ మినహా ఇతర పార్టీలు, వర్సిటీలోని విద్యార్థి సంఘాలు మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రతిపాదనను తప్పుపడుతూ ఆందోళనకు దిగడంతో దాదాపు 10 రోజులుగా వర్సిటీ లో మాస్టర్ ప్లాన్ రోడ్ల రగడ జరుగుతోంది. విద్యార్థి సంఘాల నిరసనలు బాయి కాట్, బంద్ లతో పాటు విద్యార్థి సంఘాల నేతలపై దాడులు కేసుల వరకు వ్యవహారం దారి తీసింది. దీంతో ముందుగా వర్సిటీలో 3 రోడ్లను నిర్మించాలని భావించిన తిరుపతి కార్పొరేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రెండు రోడ్ల నిర్మాణమే చేపట్టాలని నిర్ణయించింది.

ఎస్వీ యూనివర్సిటీ 5వ గేటు నుంచి NCC నగర్ వరకు 100 అడుగుల రోడ్డు, యూనివర్సిటీ ఫస్ట్ గేట్ నుంచి సైన్స్ సెంటర్ వరకు 80 అడుగులు రోడ్డు, థర్డ్ గేట్ నుంచి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ మీదుగా అలిపిరి రోడ్డును కలుపుతూ 80 అడుగుల రోడ్డు ను విస్తరించి మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించాలని ముందుగా తీర్మానించిన ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఈ మేరకు ఈ రోజు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరిగిన కౌన్సిల్ సమావేశం రెండు రోడ్లకు ఓకే చెప్పింది. పలు అభ్యంతరాలతో రెండు రోడ్ల నిర్మాణాలను మాత్రమే చేపడుతున్నట్లు డిప్యూటీ మేయర్ అభినయ్ కౌన్సిల్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన రోడ్లనే నిర్మిస్తున్నామన్నా, రోడ్లు విషయంలో వర్శిటీ వేదికగా రాజకీయ రగడ తో లబ్దిపోందాలని కొందరు చూడటం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

ఇవి కూడా చదవండి

వర్శిటిలో మాస్టర్ ప్లాన్ అమలు వివాదానికి అన్ని పార్టీల ఆలోచనలు తెలుసుకుని గెట్ నెంబర్ 3 నుండి వేయాలనుకున్న రోడ్డు వల్ల కలిగే ఇబ్బందులను గుర్తించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామన్నారు. ఇప్పుడు మొదటి గేటు నుంచి కాకుండా ఆ రోడ్డు కూడా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్క నుంచి కొత్త రోడ్డు నిర్మాణం జరుగుతుందని కౌన్సిల్ తీర్మానించింది. దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రోడ్డు రీజినల్ సైన్స్ సెంటర్ జూ పార్క్ రోడ్ కు కనెక్టివిటీ గా నిర్మాణం జరగనుండగా మరో మాస్టర్ ప్లాన్ రోడ్డు 5 వ గేటు నుంచి ప్రకాశం నగర్ మీదుగా జూ పార్క్ రోడ్డుకు కనెక్టివిటీ ఉండేలా నిర్మాణం చేపట్టేలా కౌన్సిల్ తీర్మానం జరిగింది.

మరో ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లకు వివాదానికి కౌన్సిల్ పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేసినా
మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నిరసనలు ఆందోళనలు ఆగడంలేదు. బంద్‌లు, బాయ్‌కాట్ కొనసాగుతున్నాయి. రెండ్రోజుల పాటు ఎస్వీయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు నివ్వగా మాస్టర్ ప్లాన్ రోడ్లను వ్యతిరేకించిన విద్యార్థి సంఘం నేతలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చర్చ‌గా మారింది. వైసీపీ‌కి చెందిన కొందరు వ్యక్తులు తన పై దాడి చేశారని యూనివర్సిటీ NSUI నేత మల్లికార్జున పీఎస్ లో పిర్యాదు చేయగా దాడిని ఖండిస్తూ వర్సిటీ బంద్ కు పిలుపు ఇచ్చిన స్టూడెంట్స్ జేఏసీ ఆందోళనకు దిగాయి. దీంతో ఒకవైపు యూనివర్సిటీలో కౌన్సిల్ సమావేశం మరోవైపు విద్యార్థి జెఏసి బంద్ ఆందోళనతో ఉద్రిక్తత వర్సిటీలో కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..