AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: ఆ సంస్కృతికి చెక్..! వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

తిరుమల కొండపై ఇక నుంచి వీఐపీ దర్శనాలు ఉండవా...? వీఐపీ సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందా...? సీఎం చంద్రబాబు లేటెస్ట్‌ కామెంట్స్ దేనికి సంకేతం...! ఇలా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి..

CM Chandrababu: ఆ సంస్కృతికి చెక్..! వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
CM Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2024 | 9:37 PM

Share

తిరుమల కొండపై ఇకనుంచి వీఐపీ దర్శనాలు ఉండవా…? వీఐపీ సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందా…? అంటే.. అవుననే వినిపిస్తోంది.. తిరుమలలో ఇంతకుముందో లెక్క.. ఇప్పుడో లెక్క అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖులూ సామాన్యులే అంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.. కొండపై వీఐపీ సంస్కృతి తగ్గాలంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా సామాన్య గోవిందం అన్నట్లుగానే ముందుకెళ్లాలన్నారు. అందరినీ ఒకేలా చూస్తేనే… తిరుమల పవిత్రత రెట్టింపవుతుందన్నారు. తిరుమల పద్మావతి అథితి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహంచిన చంద్రబాబు.. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

కొండపై వీఐపీ సంస్కృతి తగ్గాలంటూనే… ఆర్భాటం, అనవసర వ్యయం వద్దంటూ చంద్రబాబు సూచించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చేవారిని గౌరవించాలన్న ఆయన… దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండొద్దన్నారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించొద్దని స్పష్టం చేశారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా టీటీడీ సేవలు ఉండాలన్నారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు.

తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అని పేర్కొన్నారు. అటవీ ప్రాంత విస్తీర్ణం 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

ఇక వీఐపీ దర్శనాలపై చంద్రబాబు లేటెస్ట్‌ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. వీఐపీ దర్శనాలకు పూర్తిగా చెక్‌ పెడతారా…? అన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం