ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నిర్మలా సీతారామన్ భక్తులతో సరదాగా మాట్లాడారు. తమిళనాడుకు చెందిన ఓ చిన్ని పాప ఫొటో అడగడంతో ఆ పాపతో ఫొటో దిగారు. తన కారులో ఉన్న ప్రసాదాలను తెప్పించి ఓ బాలుడికి ఇచ్చారు.
తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బిజీబిజీగా ఉన్నారు. ఈ రోజు తిరుపతిలో జరుగనున్న టాక్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. సమావేశం అనంతరం తిరుమలకు చేరుకుని బస చేయనున్నారు. రేపు మళ్లీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం.. శ్రీకాళహస్తిశ్వరస్వామిని దర్శించుకోవడానికి కాళహస్తి చేరుకోనున్నారు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుని తిరిగి ఢిల్లీ పయనం కానున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..