డబ్బులిచ్చుకో.. నచ్చిన స్కూల్‌కు వెళ్లిపో..చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ అధికారుల ఓపెన్ ఆఫర్ ఇది. వచ్చిన అవకాశాన్ని టీచర్లు బాగానే ఉపయోగించుకున్నారు. వందల మంది అక్రమ డిప్యూటేషన్ పొందినట్టు తేలింది. పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతి తతంగమంతా ఈ ఏడాది జనవరి నుంచి నడిచినట్టు చెప్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలోని టీచర్‌నీ డిప్యుటేషన్‌పై పంపేంతలా అక్రమాలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అంతే కాదు.. కొన్ని స్కూళ్లలో ఒకే సబ్జెక్టుకు ఇద్దరేసి టీచర్లను నియమించారు. అక్రమ బదిలీల కోసం భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. అలాగే భారీ ఎత్తున టీచర్ల డిప్యుటేషన్లు ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని జిల్లా డీఈవోను విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. డీఈవో వివరణ తర్వాత ఈ వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల అక్రమాల వ్యవహారం చర్చనీయాంశంగా మారిపోయింది.
Also Read..
Year Ender 2021: పీకల దాకా మద్యం తాగి ప్రాణాలు తీస్తున్న వాహనదారులు.. ఈ ఏడాది ఎంతమందో తెలుసా?
Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చికిత్స..