అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే.. పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి, పోలవరంకు నిధులు అన్నీ కేంద్రం ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:46 pm, Tue, 13 April 21
అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే.. పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
Ap Bjp President Somu Veerraju

Somu Veerraju fires on YSRCP: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై భారతీ జనతా పార్టీ నేతలు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి, పోలవరంకు నిధులు అన్నీ కేంద్రం ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. లక్షలాది రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులను తీసుకువచ్చిన రాష్ట్ర సర్కార్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధిపై టీడీపీ, వైసీపీతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర నిధులే అని సోము వీర్రాజు తెలిపారు. క్రైస్తవులకు తాము వ్యతిరేకం కాదన్న వీర్రాజు.. కొంతమంది వైసీపీ నాయకులు చర్చ్ ప్రార్థనలో పాల్గొంటున్నారని చెప్పారు. తాము స్వామి వారి నామం పెట్టుకుంటే వైసీపీ మంత్రులు హేళనగా మాట్లాడడం సరికాదని విరుచుకుపడ్డారు. మురోవైపు, శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్తులు ఉన్నారన్న వీర్రాజు.. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు అన్యమతస్తులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ వైఖరిని బిజెపి ఖండిస్తుందని సోము స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పైన రాళ్లు వేయడాన్ని ఖండించిన ఆయన.. అమిత్ షా పైన తెలుగుదేశం జెండాలు పట్టుకుని రాళ్లు వేశారని, ప్రధాని మోదీ వస్తే నల్ల బెలూన్లు ఎగరేశారని సోము గుర్తు చేశారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2013 సెక్షన్ 90(1) ప్రకారం జాతీయ హోదా ప్రకటించారు. సెక్షన్ 90(4) ప్రకారం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటూ, పునరావాస బాధ్యతలను కేంద్రమే తీసుకుంది. ఇందుకు అనుగుణంగా కేంద్రం నిధులు కేటాయించాలి.

అయితే, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించకుండా, వాటిని నాబార్డ్ నుంచి కేటాయిస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం రూ.950 కోట్లు మాత్రమే కేటాయించింది. వీటితోపాటూ నాబార్డ్ నుంచి వచ్చిన నిధులను కూడా పరిగణనలోకి తీసుకుంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా రూ. 2,414.16 కోట్లు విడుదల చేశారు.

2017-18 లో నాలుగు విడతల్లో నాబార్డ్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.2 వేల కోట్లు నిధులు వచ్చాయి. 2018-19లో రూ.1,400 కోట్లు, 2019-20లో రూ.1850 కోట్లు చొప్పున విడుదలయ్యాయి. దీంతో నాబార్డ్ నుంచి మొత్తం రూ.7,664.16 కోట్ల నిధులు వచ్చాయి. ఇక కేంద్రం నుంచి నేరుగా వచ్చిన రూ. 950 కోట్లు కలుపుకుంటే గత ఏడేళ్లలో పోలవరం కోసం వచ్చిన మొత్తం నిధులు రూ.8,614.16 కోట్లు.

Read Also… Kinjarapu Atchannaidu: లోకేష్‌ను, నన్ను విడదీయలేరు… వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన అచ్చెన్నాయుడు