Tirupathi: 20 ఏళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న ఆవు మృతి.. ప్రత్యేక పూజలతో అంత్యక్రియలు
Tirupathi: కుటుంబంతో ఒక్కటిగా బంధం ఏర్పరచుకున్న ఆవు మరణించడంతో ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. దాదాపు 2 దశాబ్దాలుగా పాడి రైతు శేఖర్ కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉన్న ఆవు మరణించడంతో అంత్యక్రియలు కూడా ఘనంగా నిర్వహించారు. ఆవు రుణం..

హిందూ సంస్కృతిలో గోవు ఎంతో పవిత్రమైంది. అంతే కాదు గోవులో ప్రతి అణువు ఒక్కో దేవతగా చూసే వారందరికీ దైవస్వరూపం గా పరిగణిస్తారు. అందుకే గోవును గోమాతగా పూజిస్తారు. గోవు నుంచి పొందే పాలు, పెరుగు, వెన్న వంటి పదార్థాలు ఆరోగ్య కరమైనవే కాదు పవిత్రమైనవి. పోషక విలువలు ఉండేవిగా పరిగణిస్తారు. ఇక గోవు పేడ, మూత్రం కూడా వ్యవసాయంలో ఎరువుగా, క్రిమిసంహారకంగా ఉపయోగపడుతుండగా, గోవును పూజిస్తే సకల సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నది నమ్మకం. రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే పాడి ఆవు మృతి తిరుపతి జిల్లాలో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
ఏర్పేడు మండలం వికృతమాల గ్రామానికి చెందిన శేఖర్ యాదవ్ అనే రైతు ఇంట్లో 20 ఏళ్లుగా ఉన్న ఆవు మృతి చెందింది. దాదాపు పాతికేళ్ళుగా పాల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న శేఖర్ యాదవ్ ఇంట్లో ఆవు మృతి తీరని విషాదాన్ని మిగిల్చింది. పాలు అమ్ముతూ జీవనం సాగించే పాడి రైతు ఇంట్లోని ఆవు మరో 18 దూడలకు జన్మనిచ్చి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆసరానిచ్చింది.
కుటుంబంతో ఒక్కటిగా బంధం ఏర్పరచుకున్న ఆవు మరణించడంతో ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. దాదాపు 2 దశాబ్దాలుగా పాడి రైతు శేఖర్ కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉన్న ఆవు మరణించడంతో అంత్యక్రియలు కూడా ఘనంగా నిర్వహించారు. ఆవు రుణం తీర్చుకోవాలనుకున్న శేఖర్ యాదవ్ కుటుంబ సభ్యులు మృతి చెందిన గోవుకు కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల మహిళలు పూజలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇన్నేళ్లుగా కుటుంబానికి ఎంతో సాయంగా ఉన్న గోమాత మృతితో శేఖర్ కుటుంబం కన్నీటి పర్యంతం కాగా, గోమాతకు వేడుకగా అంత్యక్రియలు నిర్వహించడంలో గ్రామస్థులు కూడా భాగస్వామ్యం అయ్యారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
