Andhra: భగవంతుడా..! స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళుతుండగా ఊహించని ప్రమాదం.. చిన్నారి సహా..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషునిపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తుఫాన్ వాహనంలో బయల్దేరారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషునిపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తుఫాన్ వాహనంలో బయల్దేరారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగోల్లు దగ్గర వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.
మృతులు నంబుల వెంకట నరసమ్మ (55), నంబుల సుభాషిణి (30), అభిరామ్ (3) గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. కావలి ఏరియా వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తిరుమల దర్శనం కోసం వెళుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 12మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు.
కాగా.. గాయాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
