Tirupati: టెంపుల్ సిటీకి సరికొత్త అందం శ్రీనివాససేతు.. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం..

తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్, టిటిడి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. శ్రీనివాస సేతు తిరుమల యాత్రికులకు, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలకు తెర పడనుంది. టెంపుల్ సిటీ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతోపాటు, తిరుమలకు వెళ్లే భక్తులకు అత్యంత అనువుగా ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది

Tirupati: టెంపుల్ సిటీకి సరికొత్త అందం శ్రీనివాససేతు.. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం..
Srinivasa Setu

Edited By:

Updated on: Sep 18, 2023 | 10:47 AM

తిరుపతి నగరానికే మణిహారంగా నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శ్రీనివాస సేతు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ రోజు సీఎం జగన్ చేతులమీదుగా ప్రారంభం కానుంది. దాదాపు రూ. 684 కోట్లతో 7 కిలో మీటర్ల కు పైగా పొడవుతో నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్, టిటిడి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. శ్రీనివాస సేతు తిరుమల యాత్రికులకు, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలకు తెర పడనుంది. టెంపుల్ సిటీ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతోపాటు, తిరుమలకు వెళ్లే భక్తులకు అత్యంత అనువుగా ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది.

మొత్తం నాలుగు దశల్లో వంతెన నిర్మాణం పూర్తి కాగా .. వారధి పొడవు 7.34 కిలో మీటర్లు ఉండగా .. 173 పిల్లర్లపై నిర్మాణం జరిగింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ 684 కోట్లు కాగా  67:33 నిష్పత్తిలో టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల కేటాయింపు చేశారు. 2019 మార్చిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా ఫ్లైఓవర్ నిర్మాణంలో టీటీడీ తన వాటాగా రూ.458 కోట్లు ఖర్చు చేసింది. ఆఫ్కాన్స్ సంస్థ ఏకం తో కలిసి ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసింది. దాదాపు 5 ఏళ్ల పాటు శ్రీనివాస సేతు వంతెన పనులు వివిధ దశల్లో
పూర్తి చేయగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకున్న శ్రీనివాస సేతు తిరుపతి అభివృద్ధిలో కీలకం కానుంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..