
Tiger Tension in Kakinada: కాకినాడ జిల్లాలోని పెద్ద పులి టెన్షన్ తెలుగు డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ.. స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. బెంగాల్ టైగర్ ను బంధించడానికి అటవీశాఖ అధికారులు చేయని ప్రయత్నాలు లేనట్లు తెలుస్తోంది. దిశలను మార్చుకుంటూ పయనిస్తున్న బెంగాల్ టైగర్.. పయనం ఎటో తెలియక సతమతమవుతున్నారు అటవీశాఖ అధికారులు.. భయం గుప్పిట్లో బతుకున్నారు సమీప గ్రామాల ప్రజలు.
అయితే ఈ పులి కొంతంగి కొత్తూరు నుండి అటువైపు పెద్ద మల్లాపురం రిజర్వ్ ఫారెస్ట్ వైపు వెళితే ఊపిరిపీల్చుకున్నట్లే అని స్థానికులు అంటున్నారు. అలా కాకుండా పులి మళ్లీ తన పయనం శరభవరం వైపు వస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లే స్థానికులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పులి వేటకు విరామం ఇవ్వడంతో .. ఇప్పుడు ఆహారం కోసం దేని పైన దాడి చేస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంగాల్ టైగర్ ను బంధించడానికి అటవీశాఖ అధికారులు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. ఒకవైపు అటవీశాఖ అధికారులు మరోవైపు పోలీసులు ప్రజలకు పులి సంచారం పై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారులు పులి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తగిన సలహాలు సూచనలు చేస్తున్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..