Guntur: మాచర్లను వణికిస్తున్న పులి.. భయాందోళనలో స్థానికులు.. వివరాలివే..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 02, 2023 | 6:13 PM

Macherla: రెండు పులి పిల్లలు తల్లితో కలిసి ఆ ప్రాంతంలో సంచరించినట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. పులలను చూసి భయపడవద్దని త్రాగునీరు కోసమే అటవీని దాడి పంట పొలాల్లోకి వచ్చి ఉంటాయని అధికారులు చెప్పారు. పులలను గుర్తించేందుకు నల్లమల అటవీ సమీప పొలాలు, అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా వర్షాలు పడటంతో నీటి లభ్యత..

Guntur: మాచర్లను వణికిస్తున్న పులి.. భయాందోళనలో స్థానికులు.. వివరాలివే..
Representative Image
Follow us on

మాచర్ల, ఆగస్టు 2: రెండు నెలల క్రితం దుర్గి మండలం గజాపురం, రాజా నగరం గ్రామాల్లో పులి అడుగులు కనిపించాయి. గజాపురం సమీపంలో అవుపై దాడి చేసింది. అయితే రెండు పులి పిల్లలు తల్లితో కలిసి ఆ ప్రాంతంలో సంచరించినట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. పులలను చూసి భయపడవద్దని త్రాగునీరు కోసమే అటవీని దాడి పంట పొలాల్లోకి వచ్చి ఉంటాయని అధికారులు చెప్పారు. పులలను గుర్తించేందుకు నల్లమల అటవీ సమీప పొలాలు, అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అయితే ఒక్కసారిగా వర్షాలు పడటంతో నీటి లభ్యత పెరిగింది. దీంతో రెండు పులులు తిరిగి నల్లమల ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయినట్లు అటవీ అధికారులు చెప్పారు. దీంతో మాచర్ల నియోజకవర్గం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాత్రి పది గంటల సమయంలో మాచర్ల ఎరుకుల కాలనీ సమీపంలోని ఓ ఇంటి వద్ద వేచి ఉన్న మహిళకు పులి కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన మహిళ ఇంట్లోకి పరిగెత్తింది. ఈ విషయాన్ని అటవీ శాఖాధికారులకు తెలియజేశారు. ఘటనా స్థలంలో పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పులి కాదని కొట్టి పారేశారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రానికి మారిన మాట.

ఇది ఇలా ఉండగానే సాయంత్రం సమయంలో అదే కాలనీ సమీపంలో మరో మహిళకు పులి కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అడవి సమీపంలోనే ఉండటంతో అక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పన్నెండు చోట్ల ఈ కెమెరాలను అమర్చారు. పులి కెమెరాలకు చిక్కితే తర్వాత ఏం చేయాలనే అంశంపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఒక రోజులోనే ఇద్దరూ మహిళలకు పులి కనిపించడంతో పట్టణంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.