Tiger fear in Dwaraka Tirumala: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గుణ్ణంపల్లి, నారాయణపురం పొలాల్లో దూడలపై వరుసగా గుర్తుతెలియని జంతువు దాడి చేసింది. మూడు రోజుల్లో రెండు దూడలు మృతి చెందడంతో రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే.. పులి (Tiger) పాదముద్రలను రైతులు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. పాదముద్రలు పులిని పోలినట్లు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోందని తెలుసుకున్న రైతులు, ప్రజలు భయాందోళన చెదుతున్నారు. పులి సంచారంపై రైతులు అటవీ అధికారులకు (forest officer) ఫిర్యాదు చేశామని.. వారు వివరాలు సేకరించారని రైతులు పేర్కొంటున్నారు.
కాగా.. అంతకుముందు కూడా ద్వారకాతిరుమల అటవీ ప్రాంతంలో తరచూ పులుల భయం వెంటాడుతూనే ఉంది. అంతకుముందు కూడా పులుల సంచారం ఉండేదని ఈ ప్రాంతప్రజలు పేర్కొంటున్నారు. తాజాగా.. గుణ్ణంపల్లి, నారాయణపురం పొలాల్లో దూడలు.. చనిపోయి ఉండటాన్ని గుర్తించిన రైతులు, ఈ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Also Read: