AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: తెల్లారి టిఫిన్ కోసం క్యూ కట్టారు.. ఒక్కసారిగా గుప్పుమన్న ఘాటైన వాసన.. సీన్ కట్ చేస్తే

బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఆభరణాల కోసం హత్యలు చోటు చేసుకుంటున్నాయి. తెనాలిలో జరిగిన ఘటన కలకలం రేపింది. తెనాలి మత్తింశెట్టి పాలెంకు చెందిన మల్లేశ్వరి టిఫిన్ బండి నడుపుకుంటూ జీవిస్తుంది. మల్లేశ్వరికి కుమార్తె ఉంది. అయితే ఆమె కుమార్తె వద్దకు వెళ్లకుండా ఒక్కతే నివసిస్తుంది.

Andhra: తెల్లారి టిఫిన్ కోసం క్యూ కట్టారు.. ఒక్కసారిగా గుప్పుమన్న ఘాటైన వాసన.. సీన్ కట్ చేస్తే
Representative Image
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 03, 2025 | 1:09 PM

Share

బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఆభరణాల కోసం హత్యలు చోటు చేసుకుంటున్నాయి. తెనాలిలో జరిగిన ఘటన కలకలం రేపింది. తెనాలి మత్తింశెట్టి పాలెంకు చెందిన మల్లేశ్వరి టిఫిన్ బండి నడుపుకుంటూ జీవిస్తుంది. మల్లేశ్వరికి కుమార్తె ఉంది. అయితే ఆమె కుమార్తె వద్దకు వెళ్లకుండా ఒక్కతే నివసిస్తుంది. ప్రతి రోజూ తెల్లవారుజామున టిఫిన్ కోసం స్థానికులు మల్లేశ్వరి ఇంటి వద్దకు వస్తుంటారు. ఈ రోజు కూడా అలాగే కొంతమంది మల్లేశ్వరి ఇంటి వద్దకు వచ్చారు. అయితే మల్లేశ్వరి టిఫిన్ వేయలేదు. ఇంటి తలుపులు కూడా తీయలేదు. దీంతో స్థానికులు ఆమె కుతూరుకు సమాచారం ఇచ్చారు‌. హడావుడిగా ఇంటి వద్దకు వచ్చిన కుమార్తె తలుపులు తీసి లోపలికి వెళ్లింది. లోపల మంచం మీద తల్లిని చూడగానే అవాక్కైంది‌. ఒంటిపై దుస్తులు కూడా సరిగా లేవు.

శరీరంపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కూడా లేవు. దీంతో ఆందోళనకు గురైన కుమార్తె నాగలక్ష్మి బయటకు వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపింది‌. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న కూడా ఎప్పటిలాగే టిఫిన్ వేసిన మల్లేశ్వరి రాత్రి ఇంటిలో వెళ్ళినట్లు స్థానికులు చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదని తెలిపారు. బంగారు ఆభరణాలు మాయం కావడంతో చంపి వాటిని తీసుకెళ్ళి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శరీరంపై ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఆమె పెనుగులాడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

చాలాకాలం నుంచి ఆమెను అనుసరించిన వారే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మల్లేశ్వరి అనుమానాస్పద మృతిని చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీకెమెరా విజువల్స్ సేకరిస్తున్నారు. నిన్న నుంచి అనుమానాస్పదంగా సంచరించిన వారి వివరాలు తీసుకుంటున్నారు. శరీరంపై బంగారు చైన్, చెవి దిద్దులు, బంగారు ఉంగరాలు, పట్టీలు మాయం అయినట్లు ఆమె కుమార్తె తెలిపారు. దీంతో ఆభరణాల కోసమే హత్య చేసినట్లు అందరూ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..