TIDCO houses – Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో ఏపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ళ పంపిణీని ముమ్మరం చేసింది. పేదలపై భారం పడకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందజేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇవాళ నెల్లూరు భగత్‌సింగ్ నగర్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్‌లు టిడ్కో ఇళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెయ్యి మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స, అనిల్ అందజేశారు. రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని, 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని, కానీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నారని బొత్స చెప్పుకొచ్చారు.
ఇక, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ పాలనా దక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందని అనిల్ ఆరోపించార. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకొని మోసం చేసిందని.. అయితే, జగనన్న ప్రభుత్వం మాత్రం పేదలపై భారం పడకూడదనే రూ.7 వేల కోట్లను భరిస్తోందని పేర్కొన్నారు.
Read also: VH: ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నా: వీహెచ్