AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మవారి నగలపై కన్నేసిన.. కిటికీ లో ఇరుక్కుని నానాతంటాలు పడ్డ దొంగ.. నెట్టింట్లో వీడియో వైరల్

Srikakulam: అమ్మవారి దగ్గర ఉన్న బంగారం, వెండి పై కన్నేశాడో ఓ దొంగ.. ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. అయితే ఆ అమ్మవారి ఆలయం నుంచి దొంగిలించిన వస్తువులతో బయటకు రావడానికి కిటికీని..

Viral Video: అమ్మవారి నగలపై కన్నేసిన.. కిటికీ లో ఇరుక్కుని నానాతంటాలు పడ్డ దొంగ.. నెట్టింట్లో వీడియో వైరల్
Srikakulam Ellamma Temple
Surya Kala
|

Updated on: Apr 06, 2022 | 7:03 AM

Share

Viral Video: అమ్మవారి దగ్గర ఉన్న బంగారం, వెండి పై కన్నేశాడో ఓ దొంగ.. ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. అయితే ఆ అమ్మవారి ఆలయం నుంచి దొంగిలించిన వస్తువులతో బయటకు రావడానికి కిటికీని ఆశ్రయించాడు. అందులో ఇరుక్కుపోయాడు. దీంతో దొంగ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో చోటు చేసుకుంది. వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

జిల్లాలోని కంచిలి మండలం జాడుపూడి గ్రామంలోని జామి ఎల్లమ్మ దేవాలయం ఉంది. అయితే అమ్మవారి ఆలయం.. ఊరికి దూరంగా ఉంది. దీంతో అమ్మవారి నగలపై  కంచిలికి చెందిన పాపారావు కన్నేశాడు.  ఆలయం గోడకు ఉన్న చిన్న కిటికీలో నుంచి ఆలయంలోకి చొరబడ్డాడు. అనంతరం ఎల్లమ్మవారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, వెండిని దొంగలించి వాటిని తీసుకుని ఎలా వెళ్ళాడో.. అలారావాలనుకున్నాడు. పాపారావు ఆ నగలను తీసుకుని తిరిగి కిటికీలో నుంచి తిరిగి బయటకు వచ్చేందుకు యత్నించాడు. అయితే ఆ చిన్న కిటికీ లోనుంచి సగభాగం నడుం వరకూ బయటకు వచ్చాడు. అంతే ఆ కిటికీలో ఇరుక్కుని పోయాడు. కిటికీ నుంచి బయటకు రాలేక.. తిరిగి అమ్మవారి ఆలయంలోకి వెళ్లలేక నానాతంటాలు పడ్డాడు.  చేతిలోని బంగారం, వెండి గుడి బయట పడిపోయాయి. కిటికీలో ఇరుక్కున్న పాపారావును  అటుగా వచ్చిన గ్రామస్తులు చూశారు. ఆలయం సమీపంలోని కింద ఉన్న ఆభరణాలుచూసి షాక్ తిన్నారు. పాపారావు చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనను కిటికీ నుంచి బయటకు తీయమని పాపారావు గ్రామస్థులను వేడుకున్నాడు. అయితే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కిటికీ నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ దొంగతనానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేవుడికే కన్నం వేయాలని చూస్తే ఇలాగే ఉంటుందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశి వారు అధిక ఖర్చులు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..