Konaseema: పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలు.. అంతర్వేదిలోని గుర్రాలక్క హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

|

Jan 22, 2023 | 2:58 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలోని గుర్రాలక్క అమ్మవారి ఆలయంలో దొంగలు పడ్డారు. గుర్రాలక్క గుడిలోని డిబ్బీని దొంగిలించారు. ఏకంగా ఆలయంలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు.

Konaseema: పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలు.. అంతర్వేదిలోని గుర్రాలక్క హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు
Antarvedi Temple
Follow us on

కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయాల్లోని విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళుతూనే ఉన్నారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలోని గుర్రాలక్క అమ్మవారి ఆలయంలో దొంగలు పడ్డారు. గుర్రాలక్క గుడిలోని డిబ్బీని దొంగిలించారు. ఏకంగా ఆలయంలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయం దగ్గరున్న సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మరోవైపు అప్పనరాముని లంక గ్రామంలో శివాలయం, రామాలయం రెండు దేవాలయాల్లో దొంగలు తాళాలు పగలు గొట్టారు. అమ్మవారి బంగారు సూత్రాలు, 8 కాసుల బంగారం. 3 కేజీల వెండి నగలను దొంగలు అపహరించారు. దీంతో ఆలయ పూజారులు పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని దొంగలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు IPS 379 సెక్షన్ కింద కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ ద్వారా దర్యాఫ్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..