Gudivada: రణరంగంగా మారిన గుడివాడ.. పెట్రోల్ ప్యాకెట్లు, కత్తులతో దాడి.. మాజీ ఎమ్మెల్యేను చంపేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్..

గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయం పైకి దూసుకొచ్చిన దుండగులు.. పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. టీడీపీ...

Gudivada: రణరంగంగా మారిన గుడివాడ.. పెట్రోల్ ప్యాకెట్లు, కత్తులతో దాడి.. మాజీ ఎమ్మెల్యేను చంపేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్..
Attack In Gudivada
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 26, 2022 | 8:16 AM

గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయం పైకి దూసుకొచ్చిన దుండగులు.. పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. టీడీపీ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. మాజీ మంత్రి అనుచరులే ఈ రౌడీయిజానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. టీడీపీ ఆఫీస్ పైకి విసిరిన పెట్రోల్‌ ప్యాకెట్లకు నిప్పంటుకోలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పరిస్థితి మరింత భయానకంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరినా, దాడి చేయడానికి వస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు చెబుతున్నారు. పైగా ఈ ఘటనపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీఛార్జి చేయడం గమనార్హం.

ఇవాళ (సోమవారం) వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో మాజీ మంత్రి అనుచరుడొకరు టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేశారు. రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించారు. అంతే కాకుండా ఎక్కువ మాట్లాడితే నిన్ను లేపేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసభ్యపదజాలంతో దూషించాడు. విషయం తెలుసుకున్న రావి వర్గీయులు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ లీడర్లు, కార్యకర్తలను తీసుకుని టీడీపీ ఆఫీస్ పైకి దూసుకొచ్చారు. విధ్వంస కాండను వీడియోలు, ఫొటోలు తీస్తున్న విలేకరుల పైనా దాడి చేశారంటే అక్కడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఘటనాస్థలం వల్ల ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. వంగవీటి రంగా వర్ధంతిని సోమవారం గుడివాడలో నిర్వహించొద్దని హుకుం జారీ చేశారు. కుదరదని చెప్పినందుకే తమపై పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరారని, కత్తులతో దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. పోలీసుల సమక్షంలోనే తనపై దాడి చేశారని, కానీ పోలీసులు వారిని అడ్డుకోకపోగా.. తిరిగి తమపైనే లాఠీఛార్జి చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ వంగవీటి రంగా వర్ధంతిని నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు టీడీపీ లీడర్స్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!