B.Tech student: హాస్టల్‌లో ఉండాల్సిన బిడ్డ ఆస్పత్రిలో శవమైంది.. మిస్టరీగా మారిన బిటెక్ విద్యార్ధిని మృతి
ఒంగోలులో బిటెక్ విద్యార్దిని అనుమానాస్పదమృతి మిస్టరీగా మారింది... తిరుపతి ఎస్‌వి యూనివర్సీటిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్ధిని ఆమె స్వగ్రామం ఒంగోలులో శవమై తేలడంతో ఈ ఉదంతం కలకలం రేపింది.
ఒంగోలులో బిటెక్ విద్యార్దిని అనుమానాస్పదమృతి మిస్టరీగా మారింది… తిరుపతి ఎస్‌వి యూనివర్సీటిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్ధిని ఆమె స్వగ్రామం ఒంగోలులో శవమై తేలడంతో ఈ ఉదంతం కలకలం రేపింది. ఆమెను అపస్మారక స్తితిలో ఉండగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన ఐదుగురు యువకులు పరారయ్యారు. నోటి వెంట నురగలు కక్కుతూ చనిపోయిన స్థితిలో ఉన్న ఆ విద్యార్ధిని అప్పటికే ఆరు నెలల గర్భవతి ఉందని డాక్టర్లు గుర్తించడంతో ఆమె మృతిపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గర కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తిరుపతి హాస్టల్‌లో ఉండాల్సిన తమ బిడ్డ ఒంగోలు రిమ్స్‌లో శవమై ఎలా తేలిందని ప్రశ్నిస్తున్నారు.
తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీలో బిటెక్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్దిని చప్పిడి ప్రియ హఠాత్తుగా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలో శవమై తేలింది. మృతి చెందిన ప్రియ ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆగస్ట్ 9వ తేదీ సాయంత్రం ఓ ఐదుగురు యువకులు అపస్మారకస్థితిలో ఉన్న ప్రియను తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. దీంతో ప్రియ మృతి మిస్టరీగా మారింది. ఆరునెలల గర్భవతిగా ఉన్న ప్రియకు అబార్షన్ కోసం మందులు ఇస్తే అవి వికటించి చనిపోయిందా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రియ నోటి వెంట నురుగు రావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. అసలు తిరుపతి కాలేజిలో హాస్టల్‌లో ఉండాల్సిన ప్రియ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో శవమై ఎలా తేలిందన్న సందిగ్ధంలో ఉన్న బంధువులు, తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చప్పిడి ప్రియ చీమకుర్తిలోని ఉర్డూ పాఠశాలలో టెన్త్ , ఇంటర్ చదివింది. చదువుల్లో రాణిస్తూ మంచి మార్కులతో పాస్ అయిన చప్పిడి ప్రియకు తిరుపతిలోని ఎస్‌వి యూనివర్సిటీలో సీటు రావడంతో అక్కడ బిటెక్ ఫస్టియర్ చదువుతోంది. రెండు రోజుల క్రితం తనకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పిందని ఆమె తల్లి చెబుతోంది. అంతే తప్పా మరో విషయం తమకు చెప్పలేదని, ఇంతలో హఠాత్తుగా ఎవరో ఫోన్ చేసి ప్రియకు ఆరోగ్యం బాగులేదని, తిరుపతి నుంచి రైల్లో వస్తూ పడిపోతే ఒంగోలు ఆసుపత్రిలో చేర్చామని, అక్కడకు వెళ్ళి విచారించాలని ఫోన్ చేశారని ఆమె తండ్రి రాజు చెబుతున్నాడు. తీరా రిమ్స్ ఆసుపత్రికి వచ్చి చూస్తే ప్రియ నోటి వెంట నురుగుతో చనిపోయి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తిరుపతి ఎస్‌వి యూనివర్శిటీ హాస్టల్‌లో ఉండాల్సిన ప్రియ అసలు రైలులో ఎందుకు వచ్చిందో, ఒంగోలు రిమ్స్‌లో శవమై ఎలా తేలిందో అర్ధం కావడం లేదని ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఐదుగురు యువకులు వచ్చి ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్టు వైద్య సిబ్బంది చెబుతున్నారు. అంతకు మించి సమాధానాల కోసం పోలీసులను అడగండని చెప్పారని బావురుమంటున్నారు. అంతేకాకుండా ప్రియ ఆరు నెలల గర్భవతిగా ఉందని చెప్పడంతో తమకు ఏం జరిగిందో అర్ధం కావడం లేందంటున్నారు.
అయితే ప్రియను గర్భవతిని చేసిన యువకుడు ఎవరో అమెకు అబార్షన్ చేయించేందుకు మందులు వాడి అవి వికటించడంతో తీసుకొచ్చి రిమ్స్ ఆసుపత్రిలో పడేసి వెళ్ళిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రియకు చెందిన సెల్‌పోన్, డబ్బులు, దుస్తులు మాయం అయ్యాయని, ఆమె నైటీలో ఉండటం చూస్తుంటే ఎవరో ఆమెను ఒంగోలు ఉంచి దారుణానికి పాల్పడినట్టు అనుమానాలు ఉన్నాయంటున్నారు. మిస్టరీగా ఉన్న ప్రియ ఉదంతంపై పోలీసులు విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకునేదీ లేదని చెబుతున్న ప్రభుత్వాలు తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని ప్రియ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కూలి చేసుకునే బతికే తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి పైకొస్తుందనుకుంటే మృతదేహం తిరిగి వచ్చిందని వాపోతున్నారు. చనిపోయిన తమ బిడ్డ ఎలాగూ తిరిగి రాదని, కనీసం తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై అయినా ప్రభుత్వం విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతి ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..