AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ వరకు దిశ జర్నీ ఒక అద్భుతమే..

మనం కలలు కనడం మానేయవచ్చు కానీ.. మనలో ఉన్న సంకల్పం మాత్రం ఎప్పుడూ చావదు. పెళ్లి, బాధ్యతల మధ్య తన ఫ్యాషన్ డిజైనింగ్ కలను అటకెక్కించిన ఒక సాధారణ గృహిణి.. విధి ఆడిన వింత నాటకంలో భర్తను కోల్పోయిన తర్వాత ఏం చేసింది? కన్నీళ్లు తుడుచుకుని, కష్టాలను ఎదిరించి ఇద్దరు దర్జీలతో ప్రారంభించిన ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా ఎలా మార్చింది? అనేది తెలుసుకుందాం..

విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ వరకు దిశ జర్నీ ఒక అద్భుతమే..
The Inspiring Journey Of Disha
Krishna S
|

Updated on: Jan 18, 2026 | 2:11 PM

Share

ఆకాశమంత కలలున్నా.. బాధ్యతల భారంతో వంటింటికే పరిమితమయ్యే మహిళలు ఎందరో. కానీ దిశ కథ మాత్రం భిన్నం. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలాలనుకున్న ఆమె ఆశలపై పెళ్లి, సంసారం నీళ్లు చల్లాయి. అయితే పరిస్థితులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు. వివాహం తర్వాత ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయిన దిశ, తన అస్తిత్వం కోసం తపించారు. తన బేస్‌మెంట్‌లో ఒక చిన్న బోటిక్ తెరవాలని అడిగితే కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయినా వెనక్కి తగ్గకుండా తన అత్తమామలను ఒప్పించి కేవలం ఇద్దరు దర్జీలతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నాటి ఆ చిన్న అడుగే నేడు 25 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది.

జీవితం విసిరిన సవాళ్లు.. మనుగడ కోసం పోరాటం

దిశ జీవితంలో 2020, 2022 సంవత్సరాలు చీకటి రోజులను మిగిల్చాయి. 2020లో మామ, 2022లో భర్త మరణించడం ఆమెను మానసికంగా కుంగదీశాయి. ఒకప్పుడు అభిరుచి కోసం మొదలుపెట్టిన వ్యాపారం ఇప్పుడు ఆమె మనుగడకు, తన కుటుంబాన్ని పోషించడానికి ఏకైక మార్గంగా మారింది. ఒంటరిగా నిలబడి, వ్యాపారాన్ని విస్తరిస్తూ ఢిల్లీలోని గ్రీన్ పార్క్‌లో ఒక సక్సెస్ ఫుల్ డిజైనర్ బోటిక్‌ను నేడు ఆమె నడుపుతున్నారు.

మహిళలకు దిశ ఇస్తున్న సందేశం

డబ్బు సంపాదించడం అంటే ఈరోజే ఖర్చు చేయడం కాదు.. రేపటి కష్టకాలంలో మనల్ని మనం కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండటం అని దిశ చెబుతారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అనేది కేవలం విలాసం కాదు, అది ఒక భద్రత అని ఆమె తన జీవితం ద్వారా నిరూపించారు. మహిళలు తమ సంపాదనను పొదుపు చేయాలనుకున్నప్పుడు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు సెబీ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా KYC పూర్తి చేయాలి. ఏదైనా సమస్య ఎదురైతే SCORES పోర్టల్ లేదా స్మార్ట్ ODR పోర్టల్‌ను ఉపయోగించవచ్చు.

HDFC AMC అంటే ఏమిటి?

HDFC AMC వంటి దిగ్గజ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఈక్విటీ, స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇది 1999లో స్థాపించబడింది. 2000లో SEBI ఆమోదం పొందింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా శాఖలు, బ్యాంకులు, స్వతంత్ర ఆర్థిక సలహాదారుల ద్వారా సేవలను అందిస్తోంది.